- ఆత్మహత్య చేసుకోబోతున్న వ్యక్తిని కాపాడిన యంచ యువకులు
నవతెలంగాణ - నవీపేట్
యంచ గోదావరిలో సూసైడ్ లు ఆగడం లేదు. ఆర్మూర్ మండలం అంక్సాపూర్ గ్రామానికి చెందిన హైదర్ కుటుంబ కలహాలతో మనస్థాపం చెంది బుధవారం బాసర గోదావరిలో ఆత్మహత్య చేసుకునేందుకు వచ్చి ప్రయత్నిస్తుండగా గమనించిన స్థానిక యువకులు వినోద్, రాజు లు అతనిని పట్టుకొని కాపాడారు. అనంతరం కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చి కౌన్సిలింగ్ చేసి తిరిగి ఇంటికి పంపించారు. గత నెల రోజుల వ్యవధిలోనే గోదావరిలో ఐదుగురు ఆత్మహత్యలు చేసుకున్న సంఘటన విధితమే. ఈ విషయమై యంచ సర్పంచ్ ఆర్ అండ్ బి మంత్రితో పాటు కలెక్టర్ ,సిపీలకు విన్నవించిన స్పందన కరువైందని స్థానికులు వాపోతున్నారు. కాబట్టి ఇప్పటికైనా గోదావరిలో ఆత్మహత్యల నివారణకు ప్రభుత్వ యంత్రాంగం కృషి చేయాలని కోరుతున్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 08 Feb,2023 07:47PM