నవతెలంగాణ-భిక్కనూర్
మండల కేంద్రంలో బుధవారం మేకల దొంగకు స్థానికులు దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. స్థానికులు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మెదక్ జిల్లా రామాయంపేట మండలం కాట్రియాల గ్రామానికి చెందిన గడ్డం కృష్ణ అనే వ్యక్తి రెండు మేకలను తీసుకువచ్చి స్థానిక మటన్ మార్కెట్ వద్ద విక్రయించేందుకు ప్రయత్నించగా, మటన్ వ్యాపారులకు అనుమానం వచ్చి ఆరా తీయగా పొంతన లేని సమాధానాలు చెప్పడంతో గడ్డం కృష్ణను చితకబాది స్తంభానికి కట్టివేశారు. దీంతో తాను మేకలను దొంగతనం చేసి తీసుకు వచ్చినట్లు చెప్పడంతో స్థానికులు పోలీసులకు అప్పగించారు.
Mon Jan 19, 2015 06:51 pm