నవతెలంగాణ-భిక్కనూర్
మండల నూతన ఎమ్మార్వో గా ఇటీవల పదవి బాధ్యతలు చేపట్టిన ప్రేమ్ కుమార్ ను బుధవారం మండలంలోని పలువురు ప్రజా ప్రతినిధులు, నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి శాలువా కప్పి ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా మండలంలో రైతుల రెవెన్యూ సమస్యలు పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం ఎమ్మార్వో ప్రేమ్ కుమార్ మాట్లాడుతూ రెవెన్యూ సమస్యలు పరిష్కరించడంలో ప్రతి ఒక్కరూ సహకరించాలని ఆయన సూచించారు. ఎమ్మార్వో ను సన్మానించిన వారిలో గుర్జకుంట బి ఆర్ ఎస్ పార్టీ సీనియర్ నాయకులు కందడి రమేష్ రెడ్డి, గంగారెడ్డి, స్వామీ, నీలం రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, గోపాల్, గ్రామ నాయకులు పాల్గొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm