- ఆయిల్ ఫాం సాగుతో దీర్ఘకాలిక ఆదాయం
నవతెలంగాణ - అశ్వారావుపేట
క్షేత్ర సందర్శన,నూతన పంటలు పరిశీలన,వేర్వేరు ప్రాంతాల్లో పర్యటించడం ద్వారా సంప్రదాయ రైతులు కొత్త సాంకేతికతను అవలంబించడానికి, నూతన వ్యవసాయం,పంట మార్పిడితో అధిక దిగుబడులు ఉత్పత్తి చేసేవిధంగా ప్రేరేపింబడుతుందని ఆయిల్ ఫెడ్ డి.ఒ ఆకుల బాలక్రిష్ణ తెలిపారు. నాబార్డ్ సౌజన్యంతో,ఎస్ అండ్ టి సిరి వాలంటరీ ఆర్గనైజేషన్ పర్యవేక్షణలో యాదాద్రి భువనగిరి జిల్లా, మోతుకూరు, వెలిగొండ మండలాలకు చెందిన ఫాం ఆయిల్ సాగు చేయాలనుకునే 50 ఔత్సాహిక రైతులకు "కేట్ (సిఎటి) విజిట్ ఎక్స్పోజర్ ఏర్పాటు చేసారు.
వీరు ఈ నెల 6 వ, తేదీ సోమవారం నుండి 9 వ, తేదీ గురువారం వరకు తెలంగాణాంధ్రలోని ఆయిల్ ఫేడ్ ఐసిఎఆర్, ఐఐఒపిఆర్ సందర్శిస్తున్నారు. ఇందులో భాగంగా బుధవారం అశ్వారావుపేట ఆయిల్ ఫెడ్ ఆద్వర్యంలో సాగు అవుతున్న ఫాం ఆయిల్ క్షేత్రాలు సందర్శించారు. నర్సరీ పరిశీలన చేసారు. పరిశ్రమ వీక్షించారు. ఈ సందర్భంగా ఆ రైతులకు ఫాం ఆయిల్ సాగుతో ప్రయోజనాలు,ప్రభుత్వ రాయితీలు వివరించారు. ఈ రైతులకు ఆయిల్ ఫెడ్ సిబ్బంది ఫణి కుమార్, అప్పారావు లు గైడ్ లు గా వ్యవహరించారు. వీరికి భోజన ఏర్పాట్లను ఫైనాన్స్ ఎక్జిక్యూటివ్ రాధాక్రిష్ణ పర్యవేక్షించారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 08 Feb,2023 07:53PM