నవతెలంగాణ-గోవిందరావుపేట
మళ్లీ ప్రమాదం జరిగితేనే మూసి వేస్తారా? 163 వ జాతీయ రహదారి పసర గ్రామం ప్రారంభంలో ఉన్న పెట్రోలు బంకు రహదారి నిన్నటి వరకు మూసి ఉండగా నేడు మళ్ళీ తెరుచుకుంది. ఈ ప్రాంతంలో ఇప్పటికీ ఏడుగురు మంది ద్విచక్ర వాహనదారులు మృతి చెందారు. మళ్లీ ఓపెన్ చేయడం వల్ల ఎంతమంది మరణిస్తారు తెలియని పరిస్థితి నెలకొంది ప్రమాదంలో వ్యక్తి మరణించిన వెంటనే ప్రభుత్వ యంత్రాంగం స్పందిస్తారు జాతీయ రహదారి అధికారులతో మాట్లాడి మూసేస్తారు.
ఒక నెల రెండు నెలలు గడిచిన వెంటనే మళ్ళీ ఓపెన్ చేస్తారు. మళ్లీ ప్రమాదాలు జరగడం మృతి చెందడం ఇక్కడ సర్వ సాధారణంగా మారింది. ఈ విధానానికి ఎక్కడ పులిస్టాప్ పడుతుందో లేదో అన్న సందిగ్ధంలో వాహనదారులు ప్రజలు ఎదురుచూస్తున్నారు. ఇప్పటివరకు ఈ ప్రమాదంలో ఏడుగురు వాహనదారులు మృతిచెందగా ముందు ముందు మరింతమంది మృతి చెందాల్సిన పరిస్థితి దాపురిస్తుందో అన్న భయం ప్రజలను వెంటాడుతుంది.
భారీకేడ్ల తో మూసివేసిన ఈ ప్రాంతాన్ని తిరిగి ఓపెన్ చేయవలసిన అవసరం ఎవరికీ వచ్చింది. జాతీయ రహదారి అధికారులను అడగగా గతంలో ఎస్సై మూసివేయమని సూచించిన నేపథ్యంలో అందుకు అవసరమైన చర్యలు చేపడుతున్నామని త్వరలోనే ముసివేస్తామని అధికారులు తెలపడం జరిగింది. ఇప్పటికైనా రహదారిపై ప్రమాదగంటికలు మోగించి ప్రాణాలు తీసే ఈ మృత్యుకుహారాన్ని వెంటనే మూసివేయాల్సిందిగా స్థానిక ప్రజలు కోరుతున్నారు. మూసివేసి ముందు ప్రమాదాలు జరగకుండా ప్రాణాలు పోకుండా నివారించాలని కోరుకుంటున్నారు.