- డిఅర్ డిఎ డిఆర్ డిఓ పిడి చందర్ నాయక్
నవతెలంగాణ-డిచ్ పల్లి
మన ఊరు మనబడి కార్యక్రమంలో భాగంగా మిగిలి ఉన్న పనులను వెంటనే త్వరతగతిన పూర్తి చేసే విధంగా చర్యలు చేపట్టాలని డిఆర్డిఏ, డిఆర్డిఓ పిడి చందర్ నాయక్ అన్నారు. మంగళవారం డిచ్పల్లి మండలంలోని మెంట్రాస్ పల్లి గ్రామంలోని మన ఊరు మనబడి పనులను ఆకస్మికంగా సందర్శించి తనకి చేశారు. ఈ సందర్భంగా పిడి చందర్ నాయక్ మాట్లాడుతూ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు పనుల్లో నాణ్యత ప్రమాణాలు పాటిస్తు పనులను త్వరత గతిన పూర్తి చేసే విధంగా చుడలనన్నాను. అయన వేంట ఎంపిడిఓ గోపి బాబు, పంచాయతీ కార్యదర్శి, బిల్ కలెక్టర్ షేక్ అసిఫోద్దిన్ అధ్యాపకుల ఉన్నారు.