నవతెలంగాణ-గోవిందరావుపేట
పోడు భూమిని అందరికీ సమానంగా పంచాలి. మండలంలోని చల్వాయి గ్రామానికి చెందిన పోడు సాగుదారులు తమకు న్యాయం చేయాలంటూ బుధవారం తాహసిల్దార్ కార్యాలయం ముందు ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పోడు సాగుదారులు మాట్లాడుతూ గత పాతిక సంవత్సరాల క్రితం గ్రామానికి చెందిన 100 మంది రైతులకు పైగా సుమారు 100 ఎకరాలకు పైబడి పోడు భూములను కొట్టి సాగు చేసుకోవడం జరిగిందన్నారు. అందుకు సంబంధించిన ఆధారాలు కూడా అప్పటినుంచి ఇప్పటివరకు మా వద్ద ఉన్నాయని తెలిపారు. గత రెవెన్యూ సదస్సులలో కూడా తాము దరఖాస్తు చేసుకున్నామని అన్నారు.
630 సర్వే నెంబర్ లో ఈ పోడు భూమి ఉండగా తాము కొట్టి సాగు చేసుకోవడం జరిగిందన్నారు తర్వాత కొంతకాలానికి అటవీ అధికారులు తమ భూములంటూ తమను సాగులోకి రాకుండా అడ్డుకున్నారని అప్పటినుండి ఇప్పటివరకు మొన్నటి రెవెన్యూ సదస్సులో దరఖాస్తు చేసుకొని సర్వే చేయించడం జరిగిందన్నారు. ఆ భూమిలో సుమారు 12 ఎకరాలు అప్పటి సర్పంచి తాటి రమణ తన పదవి అధికారాన్ని అడ్డం పెట్టుకుని తన కుటుంబ సభ్యుల పేరు మీద కాస్తు రాయించుకుని ఒక మూడు ఎకరాలను తన కుమారుని పేరు మీద పట్టా చేయించుకోవడం జరిగిందన్నారు. పోడు సాగు చేయని వ్యక్తి అధికారాన్ని అడ్డం పెట్టుకొని పట్టా చేయించుకున్నారని సాగుదారులు ఆరోపించారు. రెవెన్యూ భూమి అసైన్డ్ భూమిని ఎలా పట్టా ఇచ్చారని తాసిల్దారును ప్రశ్నించారు. ఆనాడు తాసిల్దారుగా పనిచేసిన రవి రాజ్ కుమార్ రాజ్ ఏలాంటి కాగితాలు లేకుండానే ధరణి అమలులో లేకపోవడం వల్ల డబ్బులు తీసుకొని పట్టాలు ఇవ్వడం జరిగిందని సాగుదారులు అన్నారు. అప్పటి తాహసిల్దారు రవి రాజ్ కుమార్ అసైన్డ్ కమిటీ తీర్మానం మేరకు పట్టా చేసినట్లు తాహసిల్దార్ అల్లం రాజకుమార్ తెలిపారు.
సమాచార హక్కు చట్టం కింద అసైన్డ్ కమిటీ తీర్మానం ఉన్నది లేనిది తమకు అందించాలని సాగుదారులు దరఖాస్తు చేసుకోగా వారం రోజుల్లో నివేదిక ఇస్తానని అసైన్డ్ కమిటీ తీర్మానం లేనట్లయితే అట్టిపట్టాను కూడా రద్దుచేసి రిజర్వులో ఉంచుతామని తహసిల్దార్ అన్నారు. ఈ విషయంలో సంబంధిత కలెక్టర్ జోక్యం చేసుకొని తమకు న్యాయం చేయాలని తమకు మనిషికి ఒక ఎకరం మాత్రమే వస్తుందని సాగుదారులు తెలిపారు. ఈ విషయంలో అటవీ అధికారులతో మాట్లాడినట్లు సర్వేయర్ సెలవు లో ఉన్నందున రాగానే సర్వే చేయించి అది రెవెన్యూ భూమి అటవీ భూమియ అనేది నిర్ణయించడం జరుగుతుందని అప్పటివరకు ఓపిక పట్టాలని సాగుదారులకు తాహసిల్దార్ అల్లం రాజకుమార్ సూచించారు. మాకు న్యాయం జరగకపోతే సంబంధిత భూమిలో గుడిసెలు వేసుకునేందుకు సిద్ధంగా ఉన్నామని సాగుదారులు అన్నారు .ఈ కార్యక్రమంలో చల్వాయి పోడు సాగుదారులు పిట్టల లక్ష్మి, దయ్యప్ప సరూప, ఊర పెద్ది స్వర్ణలత,గుండ్ల లక్ష్మి, గుంటి కళ్యాణి, భవాని రాధా లక్ష్మి సమ్మక్క నరసింహులు రజనీకర్ గట్టు బాబు సాంబయ్య నరసయ్య సోమయ్య రాము 50 మందికి పైగా రైతులు తదితరులు పాల్గొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 08 Feb,2023 08:32PM