నవతెలంగాణ-డిచ్ పల్లి
తెలంగాణ యూనివర్సిటీ టార్గెట్ బాల్ వుమెన్ ఎంపికలు యూనివర్సిటీ గ్రౌండ్ లో బుధవారం నిర్వహించినట్లు డైరెక్టర్ స్పోర్ట్స్ గేమ్స్ డాక్టర్ టి. సంపత్ తెలిపారు. టార్గెట్ బాల్ (వుమెన్) ఎంపికల నిమిత్తం వివిధ కళాశాల నుండి, 35 మంది క్రీడాకారుణులు పాల్గొన్నారని దీనిలో మంచి నైపుణ్యం గల క్రీడాకారులను ఎంపిక చేసి సౌత్ జోన్ ఇంటర్ యూనివర్సిటి టార్గెట్ బాల్ ( వుమెన్) చాంపియన్ షిప్- 2023 లో తెలంగాణ యూనివర్సిటీ టార్గెట్ 'బాల్ టీం పాల్గొంటుందని ఈ టోర్నమెంట్ సవిత యూనివర్సిటీ, చెన్నై లో ఈ నెల 24 నుండి 26వరకు జరిగే టోర్నమెంట్ లో పాల్గొంటారని తెలిపారు. ఈ సెలెక్షన్స్ లో వివిధ కళశాలల క్రీడాకారిణి లు, ఫిజికల్ డైరెక్టర్ లు బాలమణి, హైమవతి, స్వప్న, కృతి, వర్సిటీ క్రీడా విభాగ సహాయ ప్రొఫెసర్ ఇంచార్జీ డాక్టర్. బి.ఆర్, నేత, వాలంటీరులుగా రమేష్, రాహుల్ మోహన్ గ్రౌండ్ మెన్లు రోహిణీ, వసంతరావు తదితరులు పాల్గొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 08 Feb,2023 08:34PM