- సిఐటియు నాయకులు అర్జున్
నవతెలంగాణ - అశ్వారావుపేట
నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ గ్రామీణుల అవసరాలు తీర్చే పంచాయతీ కార్మికుల కు కనీస వేతనాలు నిర్ణయించకపోవడం అన్యాయమని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షుడు పిట్టల అర్జున్ ఆవేదన వ్యక్తం చేసారు.బుదవారం గ్రామపంచాయతీ కార్మిక సంఘం మండల జనరల్ బాడీ సమావేశం ముత్తారావు అధ్యక్షతన స్థానిక ప్రజా సంఘాల కార్యాలయం సుందరయ్య భవనంలో నిర్వహించారు.
ఈ సందర్భంగా అర్జున్ మాట్లాడుతూ ఏ ప్రభుత్వ శాఖలో లేని విధంగా మల్టీ పర్పస్ విధానం గ్రామపంచాయతీ సిబ్బంది కి ఉన్నదని ఈ విధానాన్ని రద్దు చేయాలని, జీవో 60 ప్రకారం పంచాయితీ సిబ్బంది కి కేటగిరీ గా వేతనాలు పెంచాలని, నూతన లేబర్ కోడ్ లు రద్దు చేయాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో సిఐటియు మండల కన్వీనర్ కేసుపాక నర్సింహారావు,మురళి, వెంకటప్పయ్య,శ్రీను తదితరులు పాల్గొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 08 Feb,2023 08:35PM