- ప్లీడర్ గా నియమించడం పట్ల హర్షం
నవతెలంగాణ-డిచ్ పల్లి
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ యూనివర్సిటీలో చదువుకున్న లావిద్యార్థి యెండెల ప్రదిప్ కు జిల్లా అసిస్టెంట్ గవర్నమెంట్ ప్లీడర్ గా నియమించడం పట్ల తెలంగాణ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ డాక్టర్ రవిందర్ గుప్తా, ప్రొఫెసర్లు హర్షం వ్యక్తం చేసి ఏజిపి యెండల ప్రదీప్ కు అభినందనలు తెలిపి సన్మానించారు. ఈ సందర్భంగా తెలంగాణ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ డి రవీందర్ గుప్తా మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పోరడిన ఉద్యమకారులను గుర్తిస్తూ అవకాశాలు కల్పించడం గొప్ప విషయమన్నారు.అబినందించిన వారిలో తెలంగాణ యూనివర్సిటీ పరిక్షల నియంత్రణ అధికారిణి ప్రొఫెసర్ డాక్టర్ ఎం అరుణా, చంద్రశేఖర్, తోపాటు తదితరులు ఉన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm