- నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలుపుతున్న మేడారం ఎండోమెంట్ సిబ్బంది
నవతెలంగాణ - తాడ్వాయి
ఎమ్మెల్యే ప్రధాన అనుచరుడు, ఎంపీపీ భర్త బెల్లం వేణు పై కఠిన చర్యలు తీసుకోవాలని మేడారం ఎండోమెంట్ జూనియర్ అసిస్టెంట్లు బాలకృష్ణ, జగదీష్, సిబ్బంది డిమాండ్ చేశారు. బుధవారం మేడారం వనదేవతల సన్నిధిలో ఎండోమెంట్ ఆవరణలో నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఖమ్మం జిల్లా ఎండోమెంట్ సహాయ కమిషన్ కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న ఇన్స్పెక్టర్ సమత పై దాడి చేసిన ఎమ్మెల్యే ప్రధాన అనుచరుడు బెల్లం వేణు పై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఖమ్మం జిల్లా ఎండోమెంట్ సహాయ కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న సమత పై అకారణంగా దాడి చేసిన బెల్లం వేణు పై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. సమతకు న్యాయం జరిగేంత వరకు పోరాడుతామని వారు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎండోమెంట్ జూనియర్ అసిస్టెంట్ మధు, ఎండోమెంట్ సిబ్బంది లక్ష్మి, సంపత్, శ్యామ్, నారాయణ మాదిరి పుల్లయ్య తదితరులు పాల్గొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 08 Feb,2023 08:39PM