నవతెలంగాణ-భిక్కనూర్
మండలంలోని పెద్ద మల్లారెడ్డి గ్రామంలో ఆరోగ్య ఉప కేంద్రం పరిధిలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన రెండో విడత కంటి వెలుగు కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతుంది. ఈ సందర్భంగా మండల వైద్యాధికారి యేమిమా మాట్లాడుతూ ఆరోగ్య కేంద్రం పరిధిలో ఇప్పటివరకు 2300 మందికి కంటి పరీక్షలు నిర్వహించడం జరిగిందని, ప్రజలు ఉచిత కంటి పరీక్షలను సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని భిక్కనూర్, పెద్ద మల్లారెడ్డి కంటి వెలుగు కేంద్రాలలో ఇప్పటివరకు 4 వేల 700 మందికి కంటి పరీక్షలు నిర్వహించినట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ కోడూరి సాయ గౌడ్, ఏఎన్ఎంలు హేమలత, శ్యామల, కంటి వైద్యులు పాల్గొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm