- వైస్ ఛాన్సలర్ రవిందర్
నవతెలంగాణ-డిచ్ పల్లి
కామారెడ్డి జిల్లాలోని బిక్నూర్ సౌత్ క్యాంపస్ లో ఎంఎస్సి డాటా సైన్స్ అండ్ డాటా అనాలసిస్ అనే కొత్త కోర్సును ప్రారంభిస్తున్నామని తెలంగాణ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ డాక్టర్ ఎం రవిందర్ పేర్కొన్నారు.మంగళవారం యూనివర్సిటీ లోని కంప్యూటర్ సైన్స్ భవనంలోని సెమినార్ హాల్ లో సమావేశం నిర్వహించారు. "ఫేస్ గ్లోబల్ కాంపిటేషన్ హయ్యర్ ఎడ్యుకేషన్ అండ్ జాబ్ ఆపర్చునిటీస్ అబ్రాడ్ అండ్ టెక్నాలజీ ట్రెండ్స్ "అనే అంశంపై నిర్వహించిన ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ డాక్టర్ రవీందర్ గుప్తా హాజరై మాట్లాడుతూ ఈ సంవత్సరం సౌత్ క్యాంపస్ బిక్నూర్ లో ఎంఎస్సి డాటా సైన్స్ అండ్ డాటా అనాలసిస్ అనే కొత్త కోర్సును ప్రారంభిస్తున్నామని తెలిపారు.
విద్యార్థులు తమ సబ్జెక్టులలో పాటు కంప్యూటర్ లో జ్ఞానాన్ని సంపాదించాలని తెలిపారు
ఈ సమావేశంలో ప్రధాన వక్త గా హాజరైన శ్రీ రామ్ దాస్ రాయ్ మంతెన, వైస్ ప్రెసిడెంట్, జేపీ మోర్గాన్ చేస్, బోస్టన్, యూఎస్ఏ మాట్లాడుతూ ఈ ఆధునిక యుగంలో అన్ని విభాగాలకు చెందిన ఉద్యోగులు, విద్యార్థులు కంప్యూటర్ పరిజ్ఞానం తప్పనిసరిగా నేర్చుకోవలిసిన అవసరం ఏర్పడిందని, లేకుంటే వెనుకబడిపోయే ప్రమాదం పోంచి ఉందని తెలిపారు.డాటా సైన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, స్మార్ట్ హోమ్ ఆటోమేషన్, వీర్చి వల్ రియాలిటి, అగ్ మెంటెడ్ రియాలిటీ, 5 జీ నేట్ వర్క్ అనే కంప్యూటర్ విషయాలపై వివరంగా విద్యార్థులకి తెలియజేశారు.
అమెరికాలో జనాభా తక్కువ గా ఉన్నప్పటికీ అక్కడ 20వేల యూనివర్సిటీ లు ఉన్నాయని, మన దేశంలో జనాభా 140 కోట్లు ఉన్న కేవలం ఒక వెయ్యి యూనివర్సిటీ లు మాత్రమే ఉన్నాయని వివరించారు.కేవలం ఇంటర్ పాస్ అయినా విద్యార్థులు పై చదువలకై విదేశాలకు వెళ్ళవచ్చని, విదేశాల్లో పైచదువు లు చదవడానికి వెళ్లే విద్యార్థులు పాస్ పోర్ట్ సిద్ధం చేసుకోవాలని, ప్రతి సబ్జెక్టు చెందిన విద్యార్థి పైచదువుల కొరకు విదేశాలకు వెళ్లవచ్చని తెలిపారు. ఈ 6 నెలల్లో 10 మంది తెలంగాణ యూనివర్సిటీ విద్యార్థులని అమెరికా లో చదవడానికి తీసుకెళ్తానని, ప్రతి విద్యార్ధి కనీసం రెండు ఏళ్లుగా విదేశాలలో చదివితే నైపుణ్యాలు పెంపొందుతాయని తెలిపారు. ఈ సమావేశం లో రిజిస్టార్ ప్రొఫెసర్ డాక్టర్ విద్యావర్థిని, డైరెక్టర్ విదేశీ వ్యవహారాల కార్యాలయం, తెయూ, డాక్టర్ ప్రవీణ్ మామిడాల, ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ ఆరతి, పీజీ విద్యార్థులు హాజరయ్యారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 08 Feb,2023 09:00PM