- విద్యార్ధులు సామర్ధ్యాలు మెరుగు పరచాలి
నవతెలంగాణ - అశ్వారావుపేట
విద్యార్ధులు సామర్ధ్యాలను మెరుగు పరిచేలా,ప్రతీ రిజిష్టర్ పారదర్శకంగా ఉంచేలా ప్రధానోపాధ్యాయులు ను సమాయత్తం చేయాలని ఎం.ఇ.ఒ క్రిష్ణయ్య అంతర్గత మార్కుల వెరిఫికేషన్ బృందాలకు సూచించారు.
మండల వ్యాప్తంగా ఏడుగురు చొప్పున సబ్జెక్టు టీచర్లు రెండు బృందాలుగా పాఠశాలల్లో అంతర్గత మార్కుల వెరిఫికేషన్ ను తనిఖీలు చేస్తున్నారు. ఇందులో సబ్జెక్టులు వారీగా విద్యార్ధులు పొందిన మార్కులు,ఆన్ లైన్ చేసి మార్కులను పరిశీలిస్తారు. ఇందులో ఈ రెండు బృందాలకు జెడ్.పి.ఎస్.ఎస్ అశ్వారావుపేట, అచ్యుతాపురం ప్రధానోపాధ్యాయులు నరసింహారావు, పుల్లయ్య లు నేతృత్వం వహిస్తున్నారు.
Mon Jan 19, 2015 06:51 pm