నవతెలంగాణ-గోవిందరావుపేట
బీట్ ఆఫీసర్ స్థాయి నుండి సెక్షన్ ఆఫీసర్ గా పదోన్నతుడైన లావుడియా మున్నా ను బుధవారం చౌహాన్ బ్రదర్స్ ఘనంగా అభినందించారు. ఈ ప్రాంతంలోనే పుట్టి పెరిగి చదువుకొని ఉద్యోగం సంపాదించి చేస్తున్న ఉద్యోగంలో కూడా ఉత్తమ అధికారిగా రాణిస్తూ ఎన్నో ప్రశంశాలను అందుకుంటూ ప్రమోషన్ పొందిన లావుడియా మున్నా అంటే ఈ ప్రాంతంలో తెలియని వారు ఉండరు.
అదేవిధంగా విధి నిర్వహణలో కూడా ఎక్కడ తగ్గకుండా ఉద్యోగ నిర్వహణ బాధ్యతలు నిర్వర్తించి నేడు పదోన్నతులు కావడం సర్వత్ర అభినందనీయం చౌహాన్ బ్రదర్స్ తో పాటు తెలంగాణ యుటిఎఫ్ మండల ప్రధాన కార్యదర్శి లావుడియా దసురు, ఎంపీటీసీ లావుడియా రామచందర్, సర్పంచ్ లావుడియా స్వాతి వాగనాయక్, లావుడియా నరసింహ రవి పవన్ చౌహాన్ తదితరులు శాలువాలతో పదోన్నతి పొందిన మున్నాను శాలువాలతో సత్కరించి ఫ్లవర్ బొకేలతో అభినందనలు తెలిపారు. అనంతరం మున్నా మాట్లాడుతూ స్థానికుల సహకారం తోటి ఉద్యోగుల అండదండలు ఉన్నతాధికారుల తోడ్పాటు ఇప్పటికీ మర్చిపోలేదని అన్నారు. అందరికీ పేరుపేరునా కృతజ్ఞతలు తెలిపారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 08 Feb,2023 09:04PM