- ఇద్దరికి తీవ్ర గాయాలు.. ఆస్పత్రికి తరలింపు
- కంటైనర్ ను పట్టుకున్న ప్లాజా సిబ్బంది
నవతెలంగాణ-డిచ్ పల్లి
రోజువారీగా జాతీయ రహదారి 44 వద్ద మొక్కలు నాటి సమయం అయిపోవడంతో ఒక ట్రాక్టర్ లో ముగ్గురు కార్మికులు ఇంటికి వస్తుండగా ఇందల్వాయి టోల్ ప్లాజా పరిధిలోని సదాశినగర్ మండలంలోని దగ్గి అటవీ ప్రాంతంలో వెనుక నుండి వచ్చిన ఒక కంటైనర్ ట్రాక్టర్ ను ఢీకొట్టడంతో ట్రాక్టర్ పై ఉన్న ఇందల్ వాయి మండల కేంద్రంలోని తిర్మన్ పల్లి గ్రామానికి చెందిన ధర్పల్లి కిషన్ అక్కడికక్కడే మృతి చెందగా ఇద్దరికీ తీవ్ర గాయాలైనట్లు టోల్ ప్లాజా సిబ్బంది స్థానికులు తెలిపారు.
స్థానికుల వివరాల ప్రకారం టోల్ ప్లాజాలో కార్మికునిగా ఉన్న ధర్పల్లి కిషన్ తిర్మన్ పల్లి, రవీందర్ నాయక్ దేవి తండా, ట్రాక్టర్ డ్రైవర్ భూమయ్య చంద్రయాన పల్లి కి చెందిన వ్యక్తి పనులు ముగించుకొని బుధవారం సాయంత్రం తిరిగి ట్రాక్టర్పై టోల్ ప్లాజా వైపు వస్తుండగా కామారెడ్డి నుండి ఆర్మూర్ వైపు వెళ్తున్న ఒక కంటైనర్ ఢీ కొనడంతో ట్రాక్టర్ పై ఉన్న కిషన్ కు తీవ్ర గాయాలయ్యి అక్కడికక్కడే మృతి చెందగా రవీందర్ నాయక్ భూమయ్య లకు తీవ్ర గాయాలు పాలు కావడంతో టోల్ ప్లాజా హైవే అంబులెన్స్ లో చికిత్స నిమిత్తం నిజామాబాద్ లోని కేంద్ర ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకుని వెళ్లి అక్కడి నుండి ఒక ప్రయివేట్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందజేస్తున్నారువే. ధర్పల్లి కిషన్ గత కొన్ని ఏళ్ల నుండి అతంహ్గ్ హైవే టోల్ ప్లాజా లో కార్మికునిగా విధులు నిర్వహిస్తున్నారు. రోజు వారీగా అవసరం ఉన్నచోట ఇతర కార్మికులతో కలిసి రహదారి పనులను చేపడుతూ ఉంటారు దానిలో భాగంగానే రహదారికి ఇరువైపులా మొక్కలు లేని చోట మొక్కలు నాటి సమయం అయిపోవడంతో తిరిగి స్వగ్రామానికి వస్తుండగా వెనుక వస్తున్న కంటైనర్ ఢీకొనడంతో కిషన్ మృత్యువాత పడ్డాడు.
ట్రాక్టర్ ను ఢీ కొట్టిన కంటైనర్ ఘటన స్థలం వద్ద ఆగకుండా వేగంగా వెళ్లిపోవడంతో దాని వెనకలే ఉన్న ఒక కారు ఘటన స్థలాన్ని గమనించి వెంటనే టోల్ ప్లాజా మేనేజర్ చలపతిరావు సిబ్బందికి సమాచారం అందజేయడంతో టోల్ ప్లాజా సిబ్బంది వెంటనే రంగంలోకి దిగి కంటైనర్ను పట్టుకున్నారు. దీనిలో ఉన్న డ్రైవరు క్లీనర్ పారిపోతుండగా సిబ్బంది వెంబడి వారిని పట్టుకుని సదాశివ నగర్ పోలీసులకు అప్పగించినట్లు టోల్ ప్లాజా సిబ్బంది తెలిపారు. ధర్పల్లి కిషన్ మృత్యువాత విన్న కుటుంబ సభ్యులు గ్రామస్తులు శోకసంద్రంలో మునిగిపోయారు. దీంతో తిరుమనపల్లి గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. కేసు నమోదు చేసుకొని పోస్ట్మార్టం నిమిత్తం కామారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించినట్లు పోలీసులు తెలిపారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 08 Feb,2023 09:10PM