- వెంకటేశ్వర్ ను డీజీపీ కార్యాలయానికి అటాచ్డ్
నవతెలంగాణ-కంటేశ్వర్
నిజామాబాద్ కొత్త ఏసీపీగా కిరణ్ కుమార్ నియమితులయ్యారు. నిజామాబాద్ ఏసీపీగా పని చేస్తున్న ఆరె వెంకటేశ్వర్ ను డీజీపీ కార్యాలయానికి అటాచ్డ్ చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఈ మేరకు రాష్ట్రంలో 16 మంది ఏసీపీ, డీఎస్పీలను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. నిజామాబాద్ ఏసీపీగా వెంకటేశ్వర్ విధుల్లో చేరి రెండు సంవత్సరాలు పూర్తి కాగానే ఆయనను బదిలీ చేశారు. ఆయన స్థానంలో ప్రస్తుతం నిజామాబాద్ తొలి టాస్క్ ఫోర్స్ నిజామాబాద్ ఏసీపీగా నియమితులైన కిరణ్ కుమార్ ను నియమించారు. కిరణ్ కుమార్ స్థానంలో ఇప్పటికి మరెవ్వరిని నియమించలేదు. కిరణ్ కుమార్ రెండు రోజుల్లో విదుల్లో చేరనున్నట్లు తెలిసింది.
Mon Jan 19, 2015 06:51 pm