- సిఐటియు ఉపాధ్యక్షులు మల్యాల గోవర్ధన్
నవతెలంగాణ కంఠేశ్వర్
అక్రమ అరెస్టులను తీవ్రంగా ఖండించాల్సిన అవసరం ఉందని సిఐటియు ఉపాధ్యక్షులు మల్లెల గోవర్ధన్ అన్నారు. ఈ మేరకు ఇండ్లు ఇండ్ల స్థలాలు ఇవ్వాలని తలపెట్టిన హైదరాబాద్లో భాగంగా ముందస్తుగా పోలీసులు తనను అక్రమంగా అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండించారు. ప్రజాస్వామ్య పద్ధతిలో ఇండ్లు, ఇండ్ల స్థలాలు ఇవ్వాలని, చలో హైదరాబాద్ వెళ్తున్నారని, తెలిపినప్పటికీ బుధవారం అర్ధరాత్రి మా ఇంట్లోకి 6వ టౌన్ పోలీసులు వచ్చి తనను అక్రమంగా అరెస్టు చేశారు. ఈ విషయంలో తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. అలాంటప్పుడు అనుమతి ఇవ్వడం ఎందుకు అరెస్టు చేయడం ఎందుకు అని ప్రశ్నించారు.
Mon Jan 19, 2015 06:51 pm