నవతెలంగాణ-గంగాధర : గంగాధర మండలం గర్షకుర్తి గ్రామానికి చెందిన చిందం లచ్చయ్య అనే వ్యక్తి అనారోగ్యంతో మరణించగా, అతని కుటుంబానికి ఆధార్ స్వచ్చంద సంస్థ వ్యవస్థాపకుడు, కరీంనగర్ కార్పోరేటర్ కంసాల శ్రీనివాస్ ఆర్థిక సాయం అందించారు. మృతుడు లచ్చయ్య పేద కుటుంబం కావడంతో రూ. 5000 లను అందించి మృతుడి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఆయన వెంట మానవ హక్కుల పరిరక్షణ ఉద్యమ సంస్థ జిల్లా అధ్యక్షులు పుల్కం నర్సయ్య, పలువురు పాల్గొన్నారు.