నవతెలంగాణ-కంఠేశ్వర్
అర్హులైన పేదలందరికీ ఒక వంద 20 గజాల ఇంటి స్థలం ఇవ్వాలని నిర్మాణానికి ఐదు లక్షల రూపాయలు ఇవ్వాలని ప్రజాసంఘాల ఐక్య పోరాట వేదిక నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు గురువారం హైదరాబాదులో ఇంద్ర పార్క్ వద్ద జరుగుతున్న మహాధర్నాలో నిజామాబాద్ జిల్లా నుండి వందలాదిమంది తరలిరావడం జరిగింది. సందర్భంగా ప్రజా సంఘాల పోరాట వేదిక రాష్ట్ర నాయకులు వీరయ్య, సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్, సిఐటియు రాష్ట్ర కార్యదర్శి ఎస్వీ రమ, జిల్లా కార్యదర్శి నూర్జహాన్ మాట్లాడుతూ..తెలంగాణ ప్రజా సంఘాల పోరాట వేదిక ఇండ్లు, ఇండ్ల స్థలాలు, డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల సాధనకు రాష్ట్ర వ్యాప్తంగా ఫిబ్రవరి 9 తెలంగాణ ప్రజా సంఘాల పోరాట వేదిక రాష్ట్ర కమిటి పిలుపుమేరకు నిజామాబాద్ జిల్లా నుండి తరలి రావడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ. నిజామాబాద్ జిల్లాలో వందల ఎకరాల భూములు ఖాళీ స్థలాలు ఉన్నప్పటికీ అద్దాల మెడ కట్టినట్టు డబుల్ బెడ్ రూములు కట్టారు కానీ ఈరోజుటి వరకు ఎవరికీ డబుల్ బెడ్ రూమ్ గాని స్థలంలో గుడిసెలు వేసుకున్న వారికి పట్టాలు గాని సౌకర్యాలు గాని ఇల్లు లేని వారికి ఖాళీ స్థలం ఉన్నప్పటికీ పేదలకు ఇవ్వకుండా ఖాళీ స్థలాలను ప్రైవేటు కబ్జాలు చేసిన వారికి మాత్రం తోడుపాటు అందిస్తుంది. అర్హులైన పేదలు 100 గజాల స్థలం అడుగుతే వాళ్లని అరెస్టులు చేసి జైలు పాలు చేస్తుంది తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 8 సంవత్సరాలు గడిచిన పేదలకు మాత్రం న్యాయం ఇప్పటికైనా తెలంగాణ ప్రభుత్వం నిజామాబాద్ జిల్లాలో ఖాళీ ఉన్న స్థలాలలో పేద ప్రజలకు ఇల్లు నిర్మించి ఇవ్వాలని డిమాండ్ చేశారు లేనియెడల ఖాళీ స్థలంలో గుడిసెలు వేస్తామని హెచ్చరించారు.ఆందోళనలు నిర్వహిస్తున్న పేదలకు పట్టాలిచ్చి ఇండ్ల నిర్మాణం చేపట్టాలి. రాష్ట్రవ్యాప్తంగా గ్రామాలు, పట్టణాల్లో డబుల్ బెడ్రూమ్ ఇండ్ల కోసం పేదలు ధరఖాస్తులు చేసుకున్నారు. కొన్ని చోట్ల నిర్మాణం పూర్తి అయిన ఇండ్లను అర్హులకు కేటాయింపులు చేశారు. లక్షలాది మంది ధరఖాస్తులు' పెండింగ్లో ఉన్నాయి. డబుల్ బెడ్రూమ్ ఇండ్లు పూర్తి అయినవి కూడా ఇప్పటికి పేదలకు కేటాయింపులు చేయకుండా ఉన్నాయి. వాటిని వెంటనే పేదలకు కేటాయింపులు చేయాలి. అసంపూర్తిగా ఉన్న డబుల్ బెడ్రూమ్ ఇండ్లను కూడా పూర్తిచేసి అర్హులకు కేటాయించాలి. సొంత స్థలాలు ఉన్నవారికి ఇంటి నిర్మాణం కోసం డబ్బులు ఇస్తామని ఎన్నికల సందర్భంగా ప్రభుత్వం హామీ ఇచ్చింది. కానీ, ఈ ఇప్పటి వరకు ప్రారంభించలేదు. సొంత స్థలం ఉన్న వారికి 5 లక్షల రూపాయలు ఇవ్వాలి. స్థలమే లేని పేదలకు 120 గజాల స్థలం కేటాయించి 5 లక్షల రూపాయలు ఇంటి నిర్మాణం కోసం ఇవ్వాలి. రాష్ట్రంలో అనేక జిల్లాల్లో పేదలు ఇండ్లు ఇండ్ల స్థలాల కోసం దరఖాస్తులు పెట్టుకున్నారు. డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల కోసం కూడా లక్షలాదిమంది పేదలు దరఖాస్తులు పెట్టుకున్నారు. సొంత ఇల్లు లేకపోవడం వల్ల పేదలు తాము చేసిన కష్టాన్ని అద్దెలకే చెల్లించుకోవాల్సి వస్తున్నది. ప్రభుత్వం ఇప్పటికైనా తాము ఇచ్చిన హామీ ప్రకారం అర్హులైన పేదలకు ఇండ్లు, ఇండ్ల స్థలాలు ఇవ్వాలి. ఈ డిమాండ్ల సాధనకు ఫిబ్రవరి 3వ తేదీన రాష్ట్రంలోని అన్ని మున్సిపల్ పట్టణాల్లో జరుగు ధర్నాల్లో, ఫిబ్రవరి 9వ తేదీన హైదరాబాద్లో జరుగు మహాధర్నాలో లబ్దిదారులందరూ భాగస్వాములు కావాలని కోరుతున్నాం అని తెలిపారు. ప్రభుత్వ స్థలాల్లో గుడిసెలు వేసుకున్న పేదలకు పట్టాలు ఇవ్వాలి. ఇంటి నిర్మాణం కోసం ప్రతి కుటుంబానికి రూ.5 లక్షలు ఇవ్వాలి. అర్హులైన పేదలందరికీ 120 గజాల ఇంటి స్థలం ఇవ్వాలి. నిర్మాణానికి రూ.5 లక్షలు ఇవ్వాలి. ఇంటి స్థలం ఉన్న పేదలకు ఇంటి నిర్మాణం కోసం రూ.5 లక్షలు ఇవ్వాలి. అర్హులైన పేదలందరికీ డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇవ్వాలి. అసంపూర్తిగా ఉన్న డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను వెంటనే పూర్తి చేయాలి.ప్రభుత్వ భూముల్లో గుడిసెలు నిర్మించుకున్న పేదలపై దాడులు అరికట్టాలి అని తెలంగాణ ప్రజా సంఘాల పోరాట వేదిక ఆధ్వర్యంలో తెలియజేశారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 09 Feb,2023 05:22PM