నవతెలంగాణ-డిచ్ పల్లి
ప్రతి బీడీ కార్మికురాలికి 2016 రూపాయల జీవనభృతిని ఇవ్వాలని కోరుతూ తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో గురువారం డిచ్ పల్లి ఎంపీడీవో కార్యాలయం ముందు ధర్నా నిర్వహించి అనంతరం సమస్యలతో కుడిన వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్ ఐఎఫ్టియూ జిల్లా ప్రధాన కార్యదర్శి వెంకన్న మాట్లాడుతూ ముఖ్యమంత్రి కెసిఆర్ 2014 అసెంబ్లీ ఎన్నికల్లో ప్రతి బీడీ కార్మికురాలికి వెయ్యి రూపాయలు జీవనభృతి ఇస్తానని హామీ ఇచ్చి మర్చిపోయారన్నారు. ప్రభుత్వం దిగివచ్చి 1000 రూపాయల జీవన భృతి ఇవ్వడానికి పూనుకున్నదని అన్నారు. అలాగే 2018 ఎన్నికల్లో ప్రతి బీడీ కార్మికురాలికి 2016 రూపాయల జీవనభృతిని ఇస్తామని హామీ ఇచ్చి 28 ఫిబ్రవరి 2014 కటాఫ్ తేదీని పెట్టడం వలన బీడీ కార్మికులకు అన్యాయం జరిగిందని వివరించారు. తెలంగాణ రాష్ట్రంలో గల బీడీ పరిశ్రమలో సుమారు 7 లక్షల మంది బీడీ కార్మికులు వివిధ కేటగిరిలో పనిచేస్తున్నారని, గత కొన్ని సంవత్సరాలుగా చేతినిండా పని దొరకడం లేదన్నారు. నెలకు 10 నుండి 12 రోజులు మాత్రమే బీడీ కార్మికులకు పని దొరుకుతుందని, తద్వారా బీడీ కార్మికుల జీవన ఉపాధి భారంగా మారిందని రాష్ట్ర ప్రభుత్వం భావించి 2014 ఎన్నికల్లో బీడీ కార్మికులకు వెయ్యి రూపాయల జీవన భృతి ఇస్తానని హామీ ఇచ్చారు. కానీ బీడీ కార్మికులు అనేకమంది జీవనభృతిని నేడు పొందడం లేదన్నారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో 2016 రూపాయల జీవన భృతి ని ఇస్తామని హామీ ఇచ్చి కేవలం కొంతమందికి మాత్రమే జీవనభృతినివ్వడం తగదని అన్నారు తక్షణం ప్రతి బీడీ కార్మికురాలికి 2016 రూపాయల జీవన భృతిని ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నామని తెలిపారు. లేనిపక్షంలో బీడీ కార్మికుల చేత పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్ ఏరియా కార్యదర్శి కిషన్, జిల్లా నాయకులు మురళి, ఎఐపికెఎంఎస్ జిల్లా అధ్యక్షులు సాయ గౌడ్, సుజాత, స్వప్న, లక్ష్మి, స్వప్న, సుజాత, బలమని, నర్సవ్వ, బీడీ కార్మికులు పాల్గొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 09 Feb,2023 05:24PM