నవతెలంగాణ-డిచ్ పల్లి
తెలంగాణ యూనివర్సిటీ పిడిఎస్ యూ కమిటీ ఆధ్వర్యంలో చీఫ్ వార్డెన్ కు యూనివర్సిటీ లోని గర్ల్స్ హాస్టల్ లో నేలకోని ఉన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ వినతిపత్రాన్ని గురువారం అందజేశారు.ఈ సందర్భంగా యూనివర్సిటీ పిడిఎస్ యూ కార్యదర్శి జయంతి, గర్ల్స్ హాస్టల్ సెక్రెటరీ బిందు లు మాట్లాడుతూ నూతన బాలికల వసతిగృహం నిర్మించాలని, నాసిరకం ఫుడ్ వల్ల విద్యార్థులకు ఆరోగ్య సమస్యలు వస్తున్నాయని, హాస్టల్లో మంచి ఫుడ్ పెట్టాలని, స్టడీ టేబుల్స్ ,కుర్చీలు తీసుకురావాలని ఫ్యాన్లు, లైట్లు, బెడ్ కార్డ్స్ ఇతర హాస్టల్లో ఉన్న సమస్యలన్నిటిని పరిష్కరించాలని డిమాండ్ చేశారు. లేకపోతే పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో ప్రవీణ, వివేకవర్ధిని, అమూల్య, గౌతమి, వర్ష తదితరులు పాల్గొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 09 Feb,2023 05:26PM