నవ తెలంగాణ-కంఠేశ్వర్
నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ఆర్ అండ్ బి అతిథి గృహంలో అఖిల భారత ప్రజాతంత్ర విద్యార్థి సమైక్య (ఏఐఎఫ్‌డీఎస్)లో విద్యార్థిని విద్యార్థులు గురువారం చేరారు. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా కామ్రేడ్ మేత్రి రాజశేఖర్ పాలుగోని నూతన విద్యార్థి నాయకులకు కండువాలు వేసి వారిని సంఘంలోకి ఆహ్వానించారు. అనంతరం సమావేశాన్ని ఉద్దేశించి ఏఐఎఫ్డిఎస్ మైత్రి రాజశేఖర్ మాట్లాడుతూ..కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాలు ఇటీవల జరిగినటువంటి పార్లమెంటు అసెంబ్లీ సమావేశాలలో విద్యారంగానికి నిధులు కేటాయించకపోవడం విద్యారంగాన్ని పూర్తిగా విస్మరించడమే అని అన్నారు ఈరోజు విద్యారంగానికి సరిపడా నిధులు లేని పక్షంలో విద్యార్థిని విద్యార్థులకు నాణ్యమైన విద్య ఏ రకంగా సాధ్యమైతదో ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ విద్యార్థి లోకానికి సమాధానం చెప్పాలని ఆయన అన్నారు మరియు యూనివర్సిటీల అభివృద్ధిని పూర్తిగా విస్మరించి అలాగే ప్రభుత్వ పాఠశాలలలో మౌలిక వసతులను గాలికి వదిలేసి విద్యారంగాన్ని విద్యారంగాన్ని పూర్తిగా నిర్వీర్యం చేస్తూ విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్నారు అని ఆవేదన వ్యక్తం చేశారు రానున్నది పరీక్షల సమయం ఆ పరీక్షలను విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని విద్యారంగానికి పెద్దపీట వేయాల్సింది మరిచిపోయి ఆయా పార్టీలు వారి అధికార పీఠం ఏ రకంగా దక్కించుకోవాలని ప్రాణాలికలు వేసుకొని బడ్జెట్లు విడుదల చేసుకోవడం ఇంతకంటే సిగ్గుచేటు మరొకటి ఉండదని మండిపడ్డారు విద్యార్థి విద్యార్థులను చిన్న చూపు చూస్తున్న పాలక పార్టీలకు రానున్న రోజులలో తగిన గుణపాఠం చెప్పడానికి విద్యార్థి లోకం విద్యార్థి ఉద్యమాలకు సిద్ధం కావాలని పిలుపునివ్వడం జరిగింది. అలాగే ప్రభుత్వాలు తక్షణమే విద్యా వ్యతిరేక విధానాలు మానుకోవాలని ప్రభుత్వాలను హెచ్చరించడం జరిగింది.ఈ కార్యక్రమంలో గోపాల్, మయూరి, సదాశ్రీ, రాజేశ్వరి, సాయి సాత్విక్, మల్లమారి విన్నూ, పి.మధునిక ,స్పందన సంతోష్ శ్రీకాంత్, తదితరులు పాల్గొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 09 Feb,2023 05:29PM