నవతెలంగాణ-డిచ్ పల్లి
ఇళ్ల స్థలాల కోసం మహిళల కాదు తోక్కి ఆందోళన నిర్వహించారు.గ్రామంలో కావాలనే కోందరు ఇళ్ళు స్థలాలపై కావాలనే అడ్డు తగులుతున్నరని, పేర్లు ఎత్తున ఆందోళన చేశారు.అక్కడ తాత్కాలికంగా వేసిన షెడ్లను తొలగించారు. తమకు న్యాయం చేయాలని బాధితులు వేడుకున్నారు. డిచ్ పల్లి మండలంలోని ధర్మారం(బి) గ్రామంలోని సాయినగర్ కాలనీలో గల ప్రభుత్వ స్థలంలో ఇళ్ల స్థలాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ పలువురు మహిళలు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. గురువారం ఉదయం మహిళలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి ప్రభుత్వ స్థలంలో కొందరు అక్రమంగా వేసిన తాత్కాలిక షెడ్లను తొలగించారు. ప్రభుత్వ స్థలంలో షెడ్లు వేసుకున్న కబ్జాదారులకు, మహిళలకు మధ్య తీవ్ర వాగ్వివాదం చోటు చేసుకుంది. గంటన్నర పాటు గందరగోళం నెలకొనడంతో ఎస్ఐ కచ్చాకాయల గణేష్ పోలీసు సిబ్బంది తో రంగ ప్రవేశం చేసి ఇరువర్గాల వారిని సముదాయించారు.అర్టీసి చైర్మన్, నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ ఇటీవలే గ్రామంలోని ప్రభుత్వ స్థలంలో అర్హులైన పేదలకు ఇళ్ల స్థలాలు ఇప్పించాలనే ఉద్దేశంతో సర్వే నిర్వహించడానికి ఆదేశించారని, ఈ విషయం తెలిసుకున్న కొందరు వ్యక్తులు తమ ఇళ్ళకు ఆనుకుని ఉన్న ప్రభుత్వ ఖాళీ స్థలాలను కబ్జా చేసుకుని అందులో తాత్కాలిక షెడ్లు వేశారు. దీంతో ఆగ్రహానికి లోనైన మహిళలు అక్కడికి చేరుకుని షెడ్లను తొలగించడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ సందర్భంగా మహిళలు మాట్లాడుతూ గ్రామానికి చెందిన ఇళ్లు లేని పేదలకు ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ ఇళ్ల స్థలాలు ఇవ్వాలని సర్వే జరిపిస్తే గ్రామానికి చెందిన గుత్తికొండ "కోటేశ్వరరావు, బత్తుల లస్మయ్య, బత్తుల రాములు, రాజం శ్రీకాంత్, దాసరి కిరణ్ తదితరులు ఎకరంన్నర స్థలాన్ని కబ్జా చేశారని ఆరోపించారు. పేదలకు ఇళ్ళ స్థలాలు రాకుండా వీరు అడ్డుకుంటున్నారని ఆరోపించారు. ఎమ్మెల్యే స్పందించి వెంటనే అర్హులైన పేదలందరికీ ప్రభుత్వ స్థలంలో ఇళ్ల స్థలాలు మంజూరు చేసి డబుల్ బెడ్ రూం ఇండ్లు నిర్మించి ఇవ్వాలని కోరారు.అందోళన కారులను ఎస్సై కచ్చకాయల గణేష్, ఆర్ ఐ సంతోష్ లు సముదాయించడంతో ఆందోళన కారులు శాంతించారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 09 Feb,2023 05:31PM