- మాజీ ఎమ్మెల్సీ భూపతి రెడ్డి,టీపీసీసీ ప్రధానకార్యదర్శి కె.నాగేష్ రెడ్డి..
నవతెలంగాణ-డిచ్ పల్లి
రాబోయే ఎన్నికల్లో అటు కేంద్రంలో, ఇటు రాష్ట్రంలో కాంగ్రెస్ విజయ ఢంకా మోగడం ఖాయమని మాజీ ఎమ్మెల్సీ, నిజామాబాద్ రూరల్ నీయోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జీ డాక్టర్ భూపతిరెడ్డి, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి, నిజామాబాద్ మార్కేట్ కమిటీ మాజీ చైర్మన్ కె.నాగేష్ రెడ్డిలు ధీమా వ్యక్తం చేశారు. హాత్ సే హాత్ జోడో కార్యక్రమంలో భాగంగా గురువారం డిచ్ పల్లి మండలంలోని ధర్మారం(బి) గ్రామంలో కాంగ్రెస్ పార్టీ జెండా ను ఆవిష్కరించారు. అనంతరం గ్రామంలోని ప్రధాన వీధుల్లో పాదయాత్ర నిర్వహించారు. ఇంటింటికి తిరుగుతూ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సందేశాన్ని ప్రజలకు తెలిపారు. ఈ సందర్భంగా భూపతిరెడ్డి, నాగేష్ రెడ్డి లు మాట్లాడుతూ కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వాలు ప్రజా వ్యతిరేక విధానాలను అవలంభిస్తున్నాయని విమర్శించారు. రాష్ట్రంలో 24 గంటల నిరంతర విద్యుత్ సరఫరా చేస్తున్నామని ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటున్నందని, కానీ క్షేత్ర స్థాయిలో 8 గంటలు కూడా విద్యుత్ రావడం లేదన్నారు. పంటలు ఎండిపోతున్నాయని రైతులు రోడ్లపైకి వచ్చి నిరసన ప్రదర్శనలు చేస్తుంటే ప్రభుత్వానికి కళ్లు కన్పించడం లేదని విమర్శించారు. గడిచిన 8 ఏళ్ల కాలంలో రూరల్ నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధి శూన్యమని పేర్కొన్నారు. వచ్చేఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్ ను గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు ముప్పగంగారెడ్డి, అమృతాపూర్ గంగాదర్, పొలసాని శ్రీనివాస్, వాసుబాబు, శ్యాంసన్, ధర్మాగౌడ్, మురళి, రాజేశ్వర్, ఇబ్రహీం, సాయారెడ్డి, మల్కయ్య, భాస్కర్రెడ్డి, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 09 Feb,2023 05:33PM