- ఆయిల్ ఫామ్ సాగుతో రైతులకు అధిక దిగుబడి
- హబ్సిపూర్ లో రైతులకు అవగాహన సదస్సు
- ఫామాయిల్ సాగు చేస్తున్న రైతు కి సన్మానం
నవతెలంగాణ దుబ్బాక రూరల్
ఫామాయిల్ సాగు చేస్తే రైతులకు బంగారు భవిష్యత్ ఉంటుందని ,ఈసాగు ద్వారా రైతులు అధిక లాభాలు గడించవచ్చని దుబ్బాక ఎంపీపీ కొత్తపుష్పాలత, దుబ్బాక మండల వ్యవసాయ అధికారి ప్రవీణ్ కుమార్ సూచించారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక మండల పరిధిలోని హబ్సిపూర్ గ్రామానికి చెందిన భూపతి అనే రైతు వ్యవసాయ క్షేత్రంలో సాగు చేస్తున్న ఫామాయిల్ తోటను ఎంపీపీ, ఏవో, దుబ్బాక వ్యవసాయ మార్కెట్ చైర్మన్ చింతల జ్యోతి, ఎంపీటీసీ ఆస్క రవి, గ్రామ సర్పంచ్ అస్క శ్రీనివాస్ లతో కలిసి సందర్శించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడారు. తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన ఆయిల్ ఫామ్ సాగుపై చిన్న,సన్నకారు రైతులు దృష్టి పెట్టాలన్నారు. ఆయిల్ పామ్ సాగుతో రైతులకు బంగారు భవిష్యత్ ఉంటుందని,తద్వారా అధిక లాభాలు పొందవచ్చన్నారు.తక్కువ నీటితో ఎక్కువ సాగు చేసుకునే పంట ఆయిల్ ఫామ్ పంటని పేర్కొన్నారు. సబ్సిడీతో మొక్కలు ఇచ్చి డ్రిప్ సౌకర్యం కల్పించడంతో పాటు
రాయితీ, ప్రోత్సాహకాలను ప్రభుత్వం అందిస్తుందని చెప్పారు.రైతులు ప్రత్యామ్నాయ పంటలవైపు మొగ్గు చూపాలని కోరారు. తదనంతరం ఫామాయిల్ సాగు చేస్తున్న భూపతి అనే రైతును సన్మానించారు. కార్యక్రమంలో ఏఈవో, గ్రామ రైతులు, తొర్ణాల వ్యవసాయ కళాశాల విద్యార్థులు ఉన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 09 Feb,2023 05:37PM