- రోడ్డు ప్రమాదంలో చిరుత మృతి.
- పోస్టుమార్టం నిర్వహించిన వైద్యులు..
నవతెలంగాణ-డిచ్ పల్లి
ఇందల్ వాయి ఫారెస్ట్ రేంజ్ పరిధిలోని చంద్రయాన్ పల్లి అటవీ ప్రాంతంలో జాతీయ రహదారి 44 పై బుధవారం రాత్రి గూర్తు తెలియని పేర్లు వాహనం ముడేళ్ళ వయస్సు గల ఒక చిరుతను డీ కోరడంతో అది అక్కడికక్కడే మృతి చెందినట్లు ఇందల్ వాయి ఫారెస్ట్ రేంజ్ అధికారిణి హిమ చందన, డిప్యూటీ రేంజ్ అధికారి అల్గోట్ శ్రీనివాస్ లు గురువారం తెలిపారు. ప్రమాదనికి గాల కారణాలను వారు వివరించారు. జాతీయ రహదారి 44 కు ఇరువైపులా ఘట్టమైన అడవి కలిగి ఉందని మూడేళ్ల వయస్సు గల ఒక చిరుత రోడ్డు దాటుతుండగా ఒక పెద్ద భారీ వాహనం ప్రమాదవశాత్తు ఢీకొనడంతో చిరుత అక్కడికక్కడే మృతి చెందిన విషయం ఇతర వాహనాల యజమానులు తెలిపినట్లు వారు వివరించారు. వెంటనే నిజామాబాద్ ఎఫ్ డి ఓ రామ్ కిషన్, రేంజ్ అధికారిని హిమాచందన సిబ్బందితో వేంటనే అర్ధరాత్రి ఘటన స్థలానికి చేరుకొని మృతి చెందిన చిరుతను పరిశీలించి నివేదికను సిద్ధం చేసి అక్కడి నుండి చిరుతను ఇందల్ వాయి మండల కేంద్రంలోని తిర్మన్ పల్లి సెంట్రల్ నర్సరీకి తరలించారు. గురువారం ఇందల్ వాయి మండల పశువైద్యాధికారి గంగ ప్రసాద్ సిబ్బందితో కలిసి మృతి చెందిన చిరుతను పోస్టుమార్టం నిర్వహించి అనంతరం దాహన సంస్కరణలు చేపట్టారు కొట్టిన వాహనం కోసం విచారణ జరుపుతున్నామని రేంజ్ అధికారిని హిమచందన విలేకరులకు తెలిపారు. దహన సంస్కరణ కార్యక్రమంలో నిజామాబాద్ రామ్ కిషన్ ఫారెస్ట్ సిబ్బందితో కలిసి ధహనం పూర్తయ్యే వరకు అక్కడే ఉండి కార్యక్రమాన్ని పూర్తి చేయించారు. ఈ కార్యక్రమంలో ఎఫ్ బి ఓ రంజిత్ స్ట్రాయికింగ్ ఫోర్స్ సిబ్బంది తదితరులు ఉన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 09 Feb,2023 05:42PM