నవతెలంగాణ - అశ్వారావుపేట
ఆయిల్ ఫాం సాగు విస్తరణకు ప్రభుత్వం మరిన్ని ప్రోత్సాహకాలు అందిస్తుందని,ఆసక్తి,ఔత్సాహిక రైతులు వీటిని వినియోగించుకుని లబ్ధి పొందాలని పట్టు పరిశ్రమ మరియు ఉద్యాన శాఖల భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధికారి జినుగు మరియన్న రైతులను కోరారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి ఆదేశానుసారం డివిజన్ స్థాయి ఆయిల్ పామ్ అవగాహన సదస్సు గురువారం అశ్వారావుపేట నియోజక వర్గం,దమ్మపేట మండలం పట్వారి గూడెం రైతు వేదికలో ఔత్సాహిక,ఆసక్తి గల రైతులకు ఆయిల్ పామ్ డివిజన్ స్థాయి అవగాహన సదస్సు నిర్వహించడం జరిగిందని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో 16,860 ఎకరాల ఆయిల్ పామ్ లక్ష్యము నకు గాను ఇప్పటివరకు 12,300 ఎకరాల లక్ష్యం సాధించడం జరిగింది అని తెలిపారు. మిగిలిన 4,560 లక్ష్యం సాధించడానికి ఆయిల్ పామ్ మొక్కలు,బిందు సేద్యం పరికరాలు పుష్కలంగా ఉన్నాయని రైతులు సద్వినియోగం చేసుకోవాలని మరియన్న కోరారు. వ్యవసాయ శాఖ అశ్వారావుపేట సహాయ సంచాలకులు అబ్జల్ బేగం మాట్లాడుతూ దమ్మపేట, అశ్వారావుపేట,ములకలపల్లి మండలం ములలో పూర్తిగా ఆయిల్ పామ్ సాగు చేయాలని ప్రతి ఎకరం ఆయిల్ పామ్ తో నింపాలని రైతులకు సూచించారు.మండలంలో ఆయిల్ పామ్ ను విజయవంతంగా సాగుచేస్తున్న రైతులు మద్దినేని కోటేశ్వరరావు,సోయం ప్రసాద్, కోయల అచ్యుతరావు, సూరిబాబు తదితరులు తమ అనుభవాలను నూతనంగా ఆయిల్ పామ్ చేపట్టిన ఔత్సాహిక రైతులతో పంచుకున్నారు.
రైతుల అవగాహన కల్పించడానికి అల్ ఇండియా రేడియో ప్రసారమైన ఆయిల్ పామ్ నాటిక కూడా రైతులకు వినిపించారు. ఆయిల్ ఫెడ్ నందు ఆయిల్ పామ్ మొక్కలు,సిద్ధంగా ఉన్నాయని రైతులకు అవసరము మేరకు సరఫరా చేయగలమని ఆయిల్ ఫెడ్ డివిజనల్ అధికారి ఏ.బాలకృష్ణ గారు తెలియజేసారు. ఈ కార్యక్రమంలో దమ్మపేట జెడ్పీటీసీ,ఎం.పి.పి లు పైడి వెంకటేశ్వరరావు,సోయం ప్రసాద్ రావు,అశ్వారావుపేట ఉద్యాన అధికారి జి. కిషోర్,కార్యాలయం అధికారి సముద్రాల జయకుమార్, వ్యవసాయాధికారి చంద్రశేఖర్ రెడ్డి, వ్యవసాయ విస్తీర్ణం అధికారులు రవీందర్,వినోద్, దీప్తి,ఫినోలెక్స్ డి.సి.ఒ నరసింహారావు,నెటాఫిమ్ ఎఫ్.సి.ఒ నాగబాబు, ఆయిల్ఫెడ్ డి.సి.ఒ అప్పారావు లు పాల్గోన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 09 Feb,2023 05:45PM