నవతెలంగాణ-డిచ్ పల్లి
ఫిబ్రవరి 15న "జోవియాలిటీ ఆఫ్ మాథెమాటిక్స్" అనే అంశం పై నిర్వహించే సెమినార్ బ్రోచర్ ను తెలంగాణ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ డాక్టర్ రవీందర్ గుప్త వి.సి.ఛాంబర్లో గురువారం ఆవిష్కరించారు. డిసెంబర్ 22 న జరిపే మాథెమాటిక్స్ డే కార్యక్రమం లో భాగంగా ఈ సెమినార్ ను నిర్వహిస్తున్నారు.ఈ కార్యక్రమం లో మాథెమాటిక్స్ విభాగానికి చెందిన కో ఆర్డినేటర్ శ్రీనివాస్,కో కన్వీనర్లు పద్మ, శ్వేత లు పాల్గొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm