నవతెలంగాణ - రాజంపేట్
మండలంలోని ఆరెపల్లి తాండ గ్రామానికి చెందిన ప్రాథమిక పాఠశాల విద్యార్థులు గురువారం కైలాస కోటగిరి స్వామి దేవస్థానానికి విహార యాత్ర గా బయలుదేరారు. అక్కడ సామూహిక పూజలు నిర్వహించి సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించుకున్నారు. ఈ కార్యక్రమం లో పిల్లలందరూ ఉల్లాసంగా ఉత్సాహంగా పాల్గొన్నారు. అనంతరం విద్యార్థులకు ఆటల పోటీలు నిర్వహించి బహుమతులు అందజేశారు ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు అయిత బాలాజీ, ఎస్ఎంసి చైర్మన్ సభావత్ బిఖ్న,వార్డ్ మెంబర్లు లంబాడి రవీందర్, పీరియా నాయక్, నాయకులు దుల్య, నాయక్, కేతావత్ రాంసింగ్ నాయక్, పండరి, దుర్గ గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm