- సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు మల్యాల గోవర్ధన్
నవతెలంగాణ కంటేశ్వర్
ఇండ్లు, ఇండ్ల స్థలాలుధర్నాకు హైదరాబాద్ తరలివెళ్తున్న ప్రజాసంఘాల నాయకులను, కార్యకర్తలను అక్రమంగా అరెస్ట్ చేయడాన్ని సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు మల్యాల గోవర్ధన్ ఖండించారు. తెలంగాణ ప్రజా సంఘాల పోరాట వేదిక ఆధ్వర్యంలో హైదరాబాద్ ఇందిరాపార్క్ వద్ద ధర్నా నిర్వహించుకోవడానికి ప్రభుత్వం అనుమతి ఇచ్చిందని గుర్తుచేశారు. హైదరాబాద్ తరలివెళ్తారనే నేపంతో ప్రజా సంఘాల నాయకులను అర్థరాత్రి ఇండ్లలోకి వచ్చి అక్రమంగా అరెస్టు చేసిందని, ఇది ప్రభుత్వం ద్వంద్వనీతని గోవర్ధన్ విమర్శించారు. మల్యాల గోవర్ధన్ అరెస్టు చేసి ఆరవ టౌన్ పోలీస్ స్టేషన్లో ఉంచారు. నిర్బంధాలను ఎదుర్కొని నిజామాబాద్ నగరం నుండి అనేక మంది ప్రజలు హైదరాబాద్ చేరుకొని, ప్రభుత్వం నుండి ప్రజల ఆకాంక్షను ఉంచడం జరిగిందని అన్నారు. ఇండ్ల స్థలాలు పంపిణీ చేయకపోతే ప్రజలే భూ పోరాటాలకు సిద్ధం అవుతారని, అందుకు ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుంది అన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 09 Feb,2023 06:44PM