- వనదేవతలను దర్శించుకున్న ఆరోగ్యశాఖ అధికారులు
- వనదేవతలకు ప్రత్యేక మొక్కలు
నవతెలంగాణ -తాడ్వాయి
ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారంలో మినీజాతర (మండమెలిగే) పండుగ ఫిబ్రవరి 1 నుండి 4 వరకు కొనసాగింది. ఫిబ్రవరి 8 బుధవారం తిరుగువారం పండుగ కూడా ఘనంగా జరిగింది. మినీ జాతర ముగిసి తొమ్మిది రోజులైనా గురువారం నాడు కూడా భక్తులు మేడారంలో కిక్కిరిసిపోయారు. ఇంకా మినీ జాతర వైభవంగా కొనసాగుతోంది. భక్తుల రద్దీ రోజురోజుకు పెరుగుతూనే ఉంది. వనదేవతల గద్దెల వద్ద భక్తుల కోలాహలం కొనసాగుతుంది. భక్తులు మొదట జంపన్న వాగులో పుణ్య స్థానాల ఆచరించి కళ్యాణకట్టలో తలనీలాలు సమర్పించి, గద్దెల వద్దకు చేరుకొని వనదేవతలకు ఇష్టమైన పసుపు, కుంకుమ, చీరే, సారే సమర్పించి ప్రత్యేక మొక్కలు చెల్లించారు.
వనదేవతలను దర్శించుకున్న ఆరోగ్యశాఖ అధికారులు
మేడారంలోని సమ్మక్క- సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజు వనదేవతలను గురువారం హెల్త్ డైరెక్టర్ శ్రీనివాస్ సతీమణి, వారి కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, ములుగు జిల్లా వైద్యాధికారి అల్లెం అప్పయ్య, ఏటూర్ నాగారం ఐటీడీఏ డిప్యూటీ డిఎంహెచ్ఓ కోరం క్రాంతి కుమార్, ఫార్మసిస్టు అరుణ్, స్థానిక వైద్యులు, వైద్య సిబ్బంది వనదేవతలను దర్శించుకున్నారు. వీరికి పూజారుల సంఘం అధ్యక్షుడు సిద్ధబోయిన జగ్గారావు ఆధ్వర్యంలో పూజారులు, ఎండోమెంట్ ఈవో ఆధ్వర్యంలో ఎండోమెంట్ సిబ్బంది డోలు వాయిద్యాలతో ఆలయ సాంప్రదాయాల ప్రకారం ఘనంగా స్వాగతం పలికారు. వనదేవతలకు ఇష్టమైన పసుపు కుంకుమ చీరే సారే సమర్పించి ప్రత్యేక ముక్కలు చెల్లించుకున్నారు. అనంతరం పూజారులు ఎండోమెంట్ అధికారులు శాలువాలు కప్పి, అమ్మవారి ప్రసాదం సమర్పించి వారికి ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో పూజారులు సిద్ధబోయిన అరుణ్, మునీందర్ కొక్కెర కృష్ణయ్య, కాక సారయ్య, కాక కిరణ్, హెల్త్ సూపర్వైజర్ ఖాళీల్, హెల్త్ అసిస్టెంట్ చేల తిరుపతయ్య, ఎండోమెంట్ సిబ్బంది కొప్పుల శ్యామ్, సంపత్, బాలకృష్ణ, పూజారులు తదితరులు పాల్గొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 09 Feb,2023 06:44PM