నవతెలంగాణ దుబ్బాక రూరల్
ప్రజలేవరూ దృష్టి లోపంతో బాధ పడొద్దని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కంటి వెలుగు పథకాన్ని తీసుకొచ్చారని, అంధత్వ నివరణే లక్ష్యంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పని చేస్తుందని దుబ్బాక ఎంపీపీ కొత్త పుష్పాలత కిషన్ రెడ్డి అన్నారు.సిద్దిపేట జిల్లా దుబ్బాక మండల పరిధిలోని బల్వంతాపూర్ గ్రామంలో గురువారం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన కంటి వెలుగు రెండో విడత కార్యక్రమాన్ని దుబ్బాక వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్పర్సన్ చింతల జ్యోతి కృష్ణ , గ్రామ సర్పంచ్ తౌడ బాల్ లక్ష్మి, ఎంపీటీసీ కోమటిరెడ్డి రాధా మనోహర్ రెడ్డి, ఎంపీడీవో భాస్కర శర్మ, ఎంపీవో నరేందర్ రెడ్డిలతో కలిసి దుబ్బాక ఎంపీపీ కొత్త పుష్పాలత కిషన్ రెడ్డి ప్రారంభించారు..ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామంలోని ప్రతి ఒక్కరూ ఈకార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. కంటి వెలుగు పరీక్షలు చేయించున్నవారికి అవరసరమైన మందులు, అద్దాలను ప్రభుత్వం ఉచితంగా అందిస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో కంటి వెలుగు స్పెషల్ ఆఫీసర్, తిమ్మాపూర్ పీహెచ్సి వైద్య అధికారి భార్గవి , వైద్య సిబ్బంది, బల్వంతాపూర్ పాలకమండలి సభ్యులు ,గ్రామస్తులు పాల్గొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 09 Feb,2023 06:48PM