- టీపీసీసీ అధికార ప్రతినిధి మేడిపల్లి సత్యం విమర్శ
నవతెలంగాణ-గంగాధర : స్థానిక ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ అసమర్ధత, ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల మెట్ట ప్రాంత రైతులు కన్నీరు పెడుతున్నారని టీపీసీసీ అధికార ప్రతినిధి మేడిపల్లి సత్యం విమర్శించారు. గంగాధర మండలం నారాయణపూర్ ప్రాజెక్టు సంపుల వద్ద గురువారం రైతులతో కలిసి కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా టీపీసీసీ అధికార ప్రతినిధి మేడిపల్లి సత్యం మాట్లాడుతూ చెరువుకు గండిపడి ఆరు నెలలు గడుస్తున్నా కట్ట మరమత్తు చేయడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారని మండి పడ్డారు. నారాయణపూర్ కట్ట మరమ్మత్తులు పూర్తి చేసి ఏసంగి పంటలకు నీరు ఇవ్వకుంటే రైతులతో ఆందోళనలు చేపట్టాల్సి వస్తుందని ఆయన హెచ్చరించారు. గండి పూడ్చివేత పనులు సకాలంలో పూర్తి కాక వేలాది ఎకరాల్లో వరి పంట ఎండిపోతున్నాయని అన్నారు. యాసంగి సీజన్ ప్రారంభం నుంచే నారాయణపూర్ రిజర్వాయర్ పనులు పూర్తి చేయాలని రైతులు, ప్రతిపక్షాలు డిమాండ్ చేసినా ప్రభుత్వం, అధికార యంత్రాంగం పట్టించుకోలేదని అన్నారు. పనులు ఎప్పటిలోగా పూర్తిచేసి సాగునీరు అందిస్తారో అధికార యంత్రాంగం రైతులకు తెలపాలని డిమాండ్ చేశారు. ఎండుతున్న వరి పంటలను రక్షించేందుకు మూడు రోజుల్లో యుద్ధ ప్రతిపాదికన పనులు పూర్తి చేసి సాగునీరు విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. నారాయణపూర్, మంగపేట, చెర్లపల్లి గ్రామాలను ముంపు గ్రామాలుగా ప్రకటించి నిర్వాసితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నాం. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు పురుమల్ల మనోహర్, బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు దుబ్బాసి బుచ్చయ్య, కిసాన్ సెల్ అధ్యక్షుడు బూర్గు గంగయ్య, నాయకులు రాచమల్ల భాస్కర్ , అశోక్, రాయమల్లు, జాగిరపు శ్రీనివాస్ రెడ్డి, రాజేశం, రాజు, రాజశేఖరరెడ్డి, తోట కరుణాకర్, కోల ప్రభాకర్, యువజన కాంగ్రెస్ నాయకులు మంత్రి మహేందర్, రైతులు పాల్గొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 09 Feb,2023 06:49PM