నవతెలంగాణ-భిక్కనూర్
మండలంలోని పెద్దమల్లారెడ్డి గ్రామంలోని రైతు వేదికలో పద్మపాని స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో రైతులకు వరిలో తడి పొడి సాగుపై అవగాహన సమావేశాన్ని గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా వరి రైతులు నీటి వినియోగంపై అవగాహన కలిగి ఉండాలని, నీటిని వృధా చేయకుండా, అధిక దిగుబడులు వచ్చేందుకు నీటి గొట్టాలను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ లక్ష్మీ రాజలింగం, ఎంపీటీసీ కోడూరి సాయ గౌడ్, పద్మపాని స్వచ్ఛంద సంస్థ మండల కోఆర్డినేటర్ మనోజ్ కుమార్, వ్యవసాయ విస్తీర్ణ అధికారి రవి, రైతులు పాల్గొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm