నవతెలంగాణ- రామారెడ్డి
బైకు ఢీ కొట్టిన ఘటనలో, విద్యార్థి తలకు బలమైన గాయం తగిలిన ఘటన బుధవారం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.... లింగంపేట్ మండల్ కొండాపూర్ తాండకు చెందిన తాన్ సింగ్ ఉప్పల్వాయి సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో 9వ తరగతి చదువుతున్నాడు. బుధవారం సాయంత్రం గురుకుల పాఠశాల ముందర బీటీ రోడ్డుపై నడుస్తుండగా, ఉప్పల్వాయి గ్రామానికి చెందిన ఓంకార్ లైటు లేకుండా, మద్యం మత్తులో ద్విచక్ర వాహనంపై ఉప్పల్వాయి వైపు వస్తు విద్యార్థికి బలంగా ఢీకొట్టడంతో తలకు తీవ్రంగా గాయం కావడంతో, చికిత్స నిమిత్తం కామారెడ్డి తరలించగా, మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ కిమ్స్ ఆస్పత్రికి తరలించారు. ద్విచక్ర వాహనాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
Mon Jan 19, 2015 06:51 pm