నవతెలంగాణ డిచ్ పల్లి
క్రీడలలో పాల్గొనే సౌత్ క్యాంపస్ బిక్కనూరుకు చెందిన విద్యార్థుల టీషర్ట్స్ లను తెలంగాణ యూనివర్సిటీ వైస్ ఛాన్స్ లర్ ప్రొఫెసర్ డాక్టర్ రవీందర్ గుప్త గురువారం వి.సి ఛాంబర్ లో ఆవిష్కరించారు. ఈ సమావేశంలో స్పోర్ట్స్ అండ్ గేమ్స్ డైరెక్టర్ డాక్టర్ సంపత్, స్పోర్ట్స్ ఇంచార్జ్, సౌత్ క్యాంపస్ బిక్కనూరు డాక్టర్ సుధాకర్ గౌడ్, ఫిజికల్ డైరెక్టర్ బి ఆర్ నేత, అసిస్టెంట్ పీడీ బిక్కనూరు శ్రీ ధర్ తదితరులు హాజరయ్యారు.ఈ సందర్బంగా వైస్ చాన్స్ లర్ రవీందర్ మాట్లాడుతూ సౌత్ క్యాంపస్ బిక్కనూర్ కు చెందిన క్రీడల్లో పాల్గొనే విద్యార్థులు ఒకే విధమైన డ్రెస్ కోడ్ పాటించాలని వైస్ ఛాన్స్ లర్ సూచించారు.
Mon Jan 19, 2015 06:51 pm