- పీహెచ్ సీని సందర్శించిన విదేశీ బృందం సభ్యులు
- ఆరోగ్య కేంద్రం సేవలపై విదేశీ బృందం సభ్యుల కితాబ్
- వైద్యాధికారి వినోద్ బాబ్జీని అభినందించిన సభ్యులు
నవతెలంగాణ-బెజ్జంకి
మండల కేంద్రంలోని ఆరోగ్య కేంద్రం రోగులకు అందిస్తున్న వైద్య సేవలను విదేశీ బృందం సభ్యులు అభినందించారు. గురువారం మండల కేంద్రంలోని ఆరోగ్య కేంద్రాన్ని ఆస్ట్రేలియా,అమేరికా,బ్రీటన్ వైద్యులు డిల్లీ సభ్యులతో కలిసి సందర్శించి ఆస్పత్రి పరిసరాలను,రోగులకు అందిస్తున్న వైద్యు సేవలను పరిశీలించారు.విదేశీ బృందం సభ్యులకు వైద్యాధికారి వినోద్ బాబ్జీ ఘన స్వాగతం పలికారు.ఆరోగ్య కేంద్రంలో రోగులకు అందిస్తున్న వైద్య సేవలు,ప్రభుత్వ పథకాలు,ఆస్పత్రి పరిసరాలపై బృందం సభ్యులకు వైద్యాధికారి వివరించారు.అనంతరం బృందం సభ్యులను వినోద్ బాబ్జీ శాలువా కప్పి సన్మానం చేశారు.స్వచ్ఛమైన వాయువు,రంగురంగులతో ఆహ్లాదకరమైన వాతావరణంలో ఆరోగ్య కేంద్రం రుపోందించడం అనందనీయమని బృందం సభ్యులు వినోద్ బాబ్జీని ప్రత్యేకంగా అభినందించారు.ఆరోగ్య కేంద్రం సిబ్బంది కొండయ్య,సులోచన,జయశీల,ప్రమీల,అనిత,ఆశా కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 09 Feb,2023 07:04PM