నవతెలంగాణ శంకరపట్నం
శంకరపట్నం మండల పరిధిలోని ముత్తారం గ్రామానికి చెందిన బొంగొని తిరుపతి (53 )హోంగార్డుగా కరీంనగర్లో విధులు నిర్వహిస్తున్నాడు. గత ఆదివారం తన సొంత వ్యవసాయ బావి వద్ద పనులు చూసుకుంటుండగా ప్రమాదవశాత్తు కరెంటు షాక్ తగిలి స్వల్ప అస్వస్థకు గురైనాడు. మరుసటి రోజు కరీంనగర్ టూ టౌన్ నందు విధులు నిర్వహించుకుని తిరిగి బైకుపై ఇంటికి వస్తుండగా తీవ్రమైన తలనొప్పితో కాళ్లు చేతులకు పక్షవాతం రావడం గమనించిన కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం కరీంనగర్ లోని ఆసుపత్రికి తరలించారు. అక్కడ పరిశీలించిన వైద్యులు మెదడుకి శస్త్ర చికిత్స జరిపారు. శస్త్ర చికిత్స అనంతరం హోంగార్డ్ తిరుపతి కోమాలోకి వెళ్లి గురువారం మధ్యాహ్నం మరణించాడు. గత కొన్ని సంవత్సరాల పాటు స్థానిక కేశవపట్నం పోలీస్ స్టేషన్లో పనిచేసిన హోంగార్డ్ తిరుపతి మరణం పట్ల స్థానిక ఎస్సై డి. చంద్రశేఖర్,పోలీసు లు, సిబ్బంది దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 09 Feb,2023 07:08PM