నవతెలంగాణ-గోవిందరావుపేట
కల్తీ మద్యంతో మద్యం ప్రియుల ప్రాణాలు పోతే బాధ్యులు ఎవరు ఇప్పుడు మండలంలో మద్యం ప్రియుల మధ్య కొనసాగుతున్న ప్రశ్న ఇది. దీనికి సంబంధిత కంపెనీ యాజమాన్యమే బాధ్యత వహిస్తుందని చెబుతున్నారు ఎక్సైజ్ డిపార్ట్మెంట్ సీఐ గురువారం మండలంలోని లక్ష్మీనరసింహ వైన్స్ షాపులో కొందరు మద్యం ప్రియులు బీరు బాటిల్ ఖరీదు చేసి సేవిస్తున్న క్రమంలో పురుగుల అవశేషాలు చెత్త కనిపించాయి. వెంటనే వారు కౌంటర్ వద్దకు వెళ్లి ఈ బాటిల్ లో వచ్చిన అవశేషాలకు బాధ్యులెవరు తమ ప్రాణాలు పోతే ఎలా అని ప్రశ్నించిన కౌంటర్ లో ఉన్న నమ్మకం దారులు నిర్లక్ష్యంగా వ్యవహరించారు.
మేము తయారు చేయలేదు కంపెనీ బాధ్యత వహిస్తుందని తెలుపుతున్నారు. ఈ విషయమై ములుగు ఆప్కారి సిఐని మద్యం ప్రియులు ఫోన్ లో వివరణ కోరగా వైన్ షాపు యాజమాన్యానికి ఎలాంటి బాధ్యత ఉండదని తెలిపారు. వైన్ షాపు యాజమాన్యం ఏమైనా బీర్లు తయారు చేస్తున్నారా అని ప్రశ్నించారు. మద్యం సేవించి ప్రాణాలు కోల్పోతే కంపెనీ బాధ్యత వహిస్తుంది తప్ప ప్రభుత్వం కానీ ఆప్కారి శాఖ కానీ షాపు యాజమాన్యం కానీ బాధ్యత వహించదని తెలిపారు. చివరకు మద్యం ప్రియులు బాటిల్ బదులు మరో బాటిల్ ఇవ్వమన్నా కూడా కుదరదని ఎక్కడ ఫిర్యాదు చేసుకుంటారు చేసుకోండని బెదిరింపు ధోరణిలో వ్యవహరించారు సిట్టింగ్ విషయము తినుబండారాలు విక్రయిస్తున్న విషయంపై అడుగగా అవన్నీ చూసి చూడనట్టు వ్యవహరించాలని ప్రతిదీ భూతద్దంలో పెట్టి చూడకూడదని ఉచిత సలహా ఇచ్చారని మద్యం ప్రియులు తెలుపుతున్నారు.
గతంలో కూడా ఫుల్ బాటిల్ మద్యం లో పురుగుల అవశేషాలు రావడంతో ప్రశ్నించిన స్పందించకుండా కొనుగోలు చేసిన వారిపైనే దురుసుగా ప్రవర్తించి చేతనైంది చేసుకోమని బెదిరించారు. ఈ షాపు యాజమాన్యానికి ఎక్సైజ్ శాఖ అధికారులు కూడా తోడు కావడంతో వారి ఆగడాలకు అడ్డు అదుపు లేకుండా పోయింది. గత మూడు నెలల వ్యవధిలో ఇలాంటి సంఘటనలు చాలా జరిగిన అధికారులకు ఫిర్యాదు చేసిన మామూళ్ల మత్తులో పట్టించుకోకుండా ఫిర్యాదు చేసిన వారిపైనే ఉచిత సలహాలు ఇస్తూ కాలం వెళ్ళదిస్తున్నారని మద్యం ప్రియులు తెలుపుతున్నారు. బెల్టు షాపుల వాళ్లే మామూలు ఇవ్వాలి.
ఇప్పుడు మండలంలో మద్యం విక్రయంలో కొత్త నిబంధన వచ్చింది గతంలో ఏనాడూ బెల్టు షాపులను పట్టించుకోని ఎక్సైజ్ అధికారులు ఇప్పుడు కొత్తగా బెల్ట్ షాపులలో మద్యం విక్రయిస్తే చర్యలు తప్పవని విక్రయిదారులను హెచ్చరిస్తున్నారు.
ఇంతకాలం మౌనంగా ఉన్న ఈ అధికార బృందం ఇప్పుడు ఎందుకు కొత్త నిబంధన తీసుకువచ్చిందా అని బెల్టు షాపుల యాజమాన్యాన్ని వివరణ కోరగా మద్యం షాపుల వారు ఇప్పుడు ఎంఆర్పి ధరలకే విక్రయిస్తున్నందున షాపుల వారు మామూలు ఇవ్వకపోవడం వల్ల అట్టి మద్యాన్ని విక్రయిస్తున్న బెల్టు షాపులే మామూలు చెల్లించుకోవాలి అన్న నిబంధనలను తీసుకువస్తున్నారని అన్నారు. విచ్చలవిడిగా కల్తీ మద్యం తయారవుతుందని మద్యం ప్రియులు మొత్తుకున్నా పట్టించుకోని ఎక్సైజ్ సిబ్బంది ఇప్పుడు కొత్తగా బెల్ట్ షాపుల్లో మద్యం విక్రయించకూడదని నిబంధన తేవడం ఏంటని మద్యం ప్రియులు ముక్కున వేలేసుకుంటున్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 09 Feb,2023 07:12PM