హైదరాబాద్ : 1920 ఏప్రిల్ 20న రష్యాలోని తాస్కెంట్‌లో 30 మందితో 'భారత కమ్యూనిస్టు పార్టీ' ఏర్పడింది. మహ్మద్ షఫిక్ కార్యదర్శిగా ఉన్నారు. ఎమ్.ఎన్.రారు చొరవతో ఈ కమిటీ ఏర్పడింది.
1925 డిసెంబర్ 28-30 తేదీలలో కాన్పూర్‌లో సింగారవేలు చెట్టియార్ అధ్యక్షతన మరో సమావేశం జరిగింది. ఈ సమావేశంలో జెపి బగర్ హట్టా, ఎస్‌వీ ఘాటేలను కార్యదర్శులుగా ఎన్నుకున్నారు. ఆ సమయంలో ప్రధాన నాయకత్వమంతా కాన్పూర్ కుట్ర కేసులో జైలులో ఉన్నారు.
ప్రధమ మహాసభ : 1943 మే 23 నుంచి జూన్ ఒకటో తేదీ వరకు మహారాష్ట్రలోని బొంబాయిలో జరిగింది. అప్పుడు ముగ్గురితో పొలిట్‌బ్యూరో ఎన్నుకున్నారు. పి.సి.జోషి, జీ అధికారి, బీటీ రణదీవెతో కూడిన పొలిట్‌బ్యూరో 14 మందితో కేంద్ర కమిటీని ఎన్నుకుంది.
ద్వితీయ మహాసభ : 1948 ఫిబ్రవరి 28 నుంచి మార్చి ఏడో తేదీ వరకు పశ్చిమబెంగాల్‌లోని కలకత్తాలో జరిగింది. బీటీ రణదివె ప్రధాన కార్యదర్శిగా ఎన్నికయ్యారు. 31 మందితో కేంద్ర కమిటీ ఏర్పడింది. పొలిట్‌బ్యూరో సభ్యులుగా బీటీ రణదివె, భవానీసేన్, సోమనాధ్ లహరి, జి. అధికారి, అజ రు ఘోష్, ఎన్‌కే.కృష్ణన్, చండ్ర రాజేశ్వర్‌రావు, ఎం.చంద్ర శేఖర్‌రావు, ఎస్ ఎస్ యూసుఫ్‌లను ఎనుకున్నారు. 1950 మే-జూన్‌లలో సమావేశమై నూతన వ్యూహాన్ని, ఎత్తుగడల విధానాన్ని రూపొందించుకున్నారు. కేంద్ర కమిటీలో మరొక తొమ్మిది మందిని తీసుకుని చండ్ర రాజేశ్వర్‌రావును ప్రధాన కార్యదర్శిగా, మాకినేని బసవపున్నయ్య, బీమేష్ మిశ్రాను పొలిట్‌బ్యూరోలోకి తీసుకున్నారు.
మూడో మహాసభ : 1953 డిసెంబర్ 27 నుంచి 1954 జనవరి నాలుగో తేదీ వరకు తమిళనాడులోని మధురైలో జరిగింది. అజరు ఘోష్ ప్రధాన కార్యదర్శిగా, పొలిట్‌బ్యూరో సభ్యులుగా హరికిషన్‌సింగ్ సూర్జిత్, ఈఎంఎస్ నంబూద్రిపాద్, పి.రామ్మూర్తి, ఎస్‌ఏ డాంగే, రణీన్‌సేన్, చండ్ర రాజేశ్వర్‌రావు, పుచ్చలపల్లి సుందరయ్య, జెడ్‌ఏ అహ్మద్ ఎన్నికయ్యారు. మొత్తం 39 మందితో కేంద్ర కమిటీని ఎన్నుకున్నారు.కార్యక్రమం, సంబంధిత సమస్యలు, అనుసరించాల్సిన ఎత్తుగడల విధానంపై చర్చలు జరిగాయి.
నాలుగో మహాసభ : 1956 ఏప్రిల్ 19-29 తేదీలలో కేరళలోని పాలక్కాడ్‌లో జరిగింది. అజరు ఘోష్ ప్రధాన కార్యదర్శిగా, పొలిట్‌బ్యూరో సభ్యులుగా హరికిషన్‌సింగ్ సూర్జిత్, ఈఎంఎస్ నంబూద్రిపాద్, పి.రామ్మూర్తి, ఎస్‌ఏ డాంగే, భూపేష్‌గుప్తా, చండ్ర రాజేశ్వర్‌రావు, పి.సుందరయ్య, జెడ్‌ఏ అహ్మద్ ఎన్నికయ్యారు. మొత్తం 39 మందితో కేంద్ర కమిటీని ఎన్నుకున్నారు.
ఐదో మహాసభ : 1958 ఏప్రిల్ 6-13 తేదీలలో పంజాబ్‌లోని అమృత్‌సర్‌లో జరిగింది. అజరుఘోష్ ప్రధాన కార్యదర్శిగా, పొలిట్‌బ్యూరో సభ్యులుగా ఏకే గోపాలన్, బీటీ రణదివె. ఎస్‌ఏ డాంగే, భూపేష్‌గుప్తా, పీసీ జోషి, మాకినేని బసవపున్నయ్య, జెడ్‌ఏ అహ్మద్‌లను ఎన్నుకున్నారు. మొత్తం 101 మంది కౌన్సిల్ సభ్యులుగా, కేంద్ర ఎగ్జిక్యూటివ్ కమిటీ 25 మందితో ఏర్పడింది.
ఆరో మహాసభ : 1961 ఏప్రిల్ 7-16 తేదీలలో ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడలో జరిగింది. అజరుఘోష్ ప్రధాన కార్యదర్శిగా ఎస్‌ఏ డాంగే, భూపేష్‌గుప్తా, జెడ్‌ఏ అహ్మద్, ఎమ్‌ఎన్ గోవిందన్ నాయర్‌లతో సెంట్రల్ సెక్రట రియేట్ ఏర్పడింది. 110 మంది నేషనల్ కౌన్సిల్ సభ్యు లుగా, 24 మంది కేంద్ర ఎగ్జిక్యూటివ్ సభ్యులుగా ఎన్నిక య్యారు. 1962లో కామ్రేడ్ అజరు ఘోష్ మరణాంతరం ఎస్‌ఏ డాంగే చైర్మెన్‌గా ఇఎం ఎస్ నంబూద్రిపాద్ కార్యదర్శిగా ఎన్నికయ్యారు. 1964లో జరిగిన నేషనల్ కౌన్సిల్ నుంచి 32 మంది సభ్యులు వాకౌట్ చేయటంతో సీపీఐ(ఎం) ఏర్పాటుకు నాంది పలికింది.
ఏడవ మహాసభ : 1964 అక్టోబర్ 31 నుంచి నవంబర్ ఏడో తేదీ వరకు కలకత్తాలో జరిగింది. సీపీఐ(ఎం) తొలి కార్యదర్శిగా పుచ్చలపల్లి సుందరయ్య ఎన్నికయ్యారు. 41 మందితో కేంద్ర కమిటీని ఎన్నుకున్నారు. పొలిట్‌బ్యూరో మాకినేని బసవపున్నయ్య, పి. రామ్మూర్తి, హరికిషన్‌సింగ్ సూర్జిత్, జ్యోతిబసు, ఎకె గోపాలన్, ఇఎంఎస్ నంబూద్రిపాద్, ప్రమోద్‌దాస్ గుప్తా, బిటి రణదివెలతో ఏర్పడింది.
ఎనిమిదో మహాసభ : 1968 డిసెంబర్ 23-29 తేదీలలో కేరళలోని కొచ్చిలో జరిగింది. పుచ్చలపల్లి సుందరయ్య ప్రధాన కార్యదర్శిగా, పొలిట్‌బ్యూరో సభ్యులుగా మాకినేని బసవపున్నయ్య, పి. రామ్మూర్తి, హరికిషన్‌సింగ్ సూర్జిత్, జ్యోతిబసు, ఏకే గోపాలన్, ఇఎంఎస్ నంబూద్రిపాద్, ప్రమోద్‌దాస్ గుప్తా, బీటీ రణదివెలతో ఏర్పడింది. 28 మందితో కేంద్ర కమిటీ ఏర్పడింది.
బరద్వాన్ ప్లీనం : 1967లో పార్టీ కార్యక్రమం, ఎత్తుగడల పంథాపై నక్సలైట్ల దాడి ప్రారంభమై చీలిక వచ్చింది. వామపక్ష దుందుడుకు వైఖరికి గల కారణాలను విశ్లేషిస్తూ బెంగాల్‌లోని బర్ద్వాన్‌లో 1968లో జరిగిన ప్లీనంలో డాక్యుమెంట్ ఆమోదించారు.
తొమ్మిదో మహాసభ : 1972 జూన్ 27 నుంచి జూలై 2వ తేదీ వరకు తమిళనాడులోని మధురైలో జరిగింది. ప్రధాన కార్యదర్శిగా పుచ్చలపల్లి సుందరయ్య, గతంలో కొనసాగిన తొమ్మిది మంది సభ్యులతో పొలిట్‌బ్యూరో ఏర్పడింది. 32 మందిని కేంద్ర కమిటీకి ఎన్నుకున్నారు.
పదో మహాసభ : 1978 ఏప్రిల్ 2-8 తేదీలలో పంజాబ్‌లోని జలంధర్‌లో జరిగింది. ఇఎంఎస్ నంబూద్రిపాద్ ప్రధానకార్యదర్శిగా, మాకినేని బసవపున్నయ్య, పి.రామ్మూర్తి, హరికిషన్ సింగ్ సూర్జిత్, సమర్‌ముఖర్జీ, ఏ బాలసుబ్రమణ్యమ్, ఇ బాలానందన్, పి.సుందరయ్య, బీటీ రణదీవె, జ్యోతిబసు, ప్రమోద్‌దాస్‌గుప్తాలతో పొలిట్‌బ్యూరో ఏర్పడింది. 44 మందిని కేంద్ర కమిటీకి ఎన్నుకున్నారు. వామపక్ష, ప్రజాతంత్ర ఐక్య సంఘటన నిర్మాణం తక్షణ కర్తవ్యంగా నిర్ణయించింది. 1978 సాల్కియా ప్లీనం నిర్మాణం కర్తవ్యాల ప్రకారం హిందీ భాషా ప్రాంతాలలో మనం బలం పెంచుకోవాలని నిర్ణయించారు.
పదకొండో మహాసభ : 1982 జనవరి 26-31 తేదీలలో ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడలో జరిగింది. ఇఎంఎస్ నంబూద్రిపాద్ పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఎన్నికయ్యారు. మాకినేని బసవపున్నయ్య, ప్రమోద్‌దాస్ గుప్తా, పి. రామ్మూర్తి, హరికిషన్‌సింగ్ సూర్జిత్, సమర్ ముఖర్జీ, ఇ బాలానందన్, బిటి రణదివె, జ్యోతిబసులతో పొలిట్‌బ్యూరో ఏర్పడింది. 42 మందితో కేంద్ర కమిటీ ఏర్పడింది.
12 వ మహాసభ : 1985 డిసెంబర్ 25-29 తేదీలలో పశ్చిమ బెంగాల్‌లోని కలకత్తాలో జరిగింది. ఇఎంఎస్ నంబూద్రిపాద్ ప్రధాన కార్యదర్శిగా, మాకినేని బసవపున్నయ్య, హరికిషన్‌సింగ్ సూర్జిత్, సమర్ ముఖర్జీ, ఇ బాలానందన్, బిటి రణదివె, జ్యోతిబసు, నృపేన్ చక్రవర్తి, సరోజ్ ముఖర్జీ, విఎస్ అచ్యుతానందన్‌తో పొలిట్‌బ్యూరో ఏర్పడింది. 70 మందితో కేంద్ర కమిటీ ఏర్పడింది.
13వ మహాసభ : 1988 డిసెంబర్ 27 నుంచి జనవరి ఒకటో తేదీ వరకు కేరళలోని తిరువనంతపురంలో జరిగింది. ఇఎంఎస్ నంబూద్రిపాద్ ప్రధాన కార్యదర్శిగా నాలుగో సారి ఎన్నికయ్యారు. మాకినేని బసవపున్నయ్య, హరికిషన్‌సింగ్ సూర్జిత్, సమర్ ముఖర్జీ, ఇ బాలానందన్, బిటి రణదివె, జ్యోతిబసు, నృపేన్ చక్రవర్తి, సరోజ్ ముఖర్జీ, వీఎస్ అచ్యుతా నందన్, ఏ నల్లశివన్, లావుబాల గంగాధర్‌రావులతో పొలిట్‌బ్యూరో ఏర్పడింది. 70 మందితో కేంద్ర కమిటీ ఏర్పడింది. ఐదుగురితో సెంట్రల్ సెక్రటరియేట్ ఏర్పడింది.
14వ మహాసభ : 1992 జనవరి 3-10 తేదీలలో తమిళ నాడులోని మద్రాసు పట్టణంలో జరిగింది. హరికిషన్ సింగ్ సూర్జిత్ ప్రధాన కార్యదర్శిగా ఎన్నికయ్యారు. నృపేన్ చక్రవర్తి, ఇఎంఎస్ నంబూద్రిపాద్, ఇ బాలానందన్, జ్యోతి బసు, మాకినేని బసవపున్నయ్య, వీఎస్ అచ్యుతానందన్, ఏ నల్లశివన్, లావు బాలగంగాధర్‌రావు, ఇకే నయనార్, సీతారాం ఏచూరీ, ప్రకాశ్‌కరత్, ఎస్.రామచంద్రన్ పిళ్లై, బినయకృష్ణ చౌదరి, సునిల్‌మైత్రా, పి. రామచంద్రన్, శైలేన్ దాస్ గుప్తాలతో పొలిట్‌బ్యూరో ఏర్పడింది. 63 మందితో కేంద్ర కమిటీ ఎన్నికైంది.
15వ మహాసభ : 1995 ఏప్రిల్ 2 నుంచి 8 వరకు పంజాబ్‌లోని చండీఘడ్‌లో జరిగింది. హరికిషన్‌సింగ్ సూర్జిత్ ప్రధాన కార్యదర్శిగా ఎన్నికయ్యారు. ఇఎంఎస్ నంబూద్రిపాద్, ఇ బాలానందన్, జ్యోతిబసు, విఎస్ అచ్యుతానందన్, ఏ నల్లశివన్, లావు బాలగంగాధర్‌రావు, ఇకే నయనార్, సీతారాం ఏచూరీ, ప్రకాశ్‌కరత్, ఎస్.రామచంద్రన్ పిళ్లై, బినయకృష్ణ చౌదరి, సునిల్‌మైత్రా, పి. రామచంద్రన్, శైలేన్ దాస్ గుప్తా, మోటూరు హనుమంతరావులతో పొలిట్‌బ్యూరో ఏర్పడింది. 71 మందితో కేంద్ర కమిటీ ఏర్పడింది.
16వ మహాసభ : 1998 అక్టోబర్ 5 నుంచి 11వ తేదీలలో పశ్చిమ బెంగాల్‌లోని కలకత్తాలో జరిగింది. హరికిషన్‌సింగ్ సూర్జిత్ మూడోసారి ప్రధాన కార్యదర్శిగా ఎన్నికయ్యారు. ఇ బాలా నందన్, జ్యోతిబసు, విఎస్ అచ్యుతానందన్, ఇకె నయనార్, సీతారాం ఏచూరీ, ప్రకాశ్‌కరత్, ఎస్.రామచంద్రన్ పిళ్లై, బినయకృష్ణ చౌదరి, పి. రామచంద్రన్, శైలేన్ దాస్ గుప్తా, మోటూరు హనుమంతరావు, ఆర్.ఉమానాధ్‌లతో పొలిట్ బ్యూరో ఏర్పడింది. 75 మందితో కేంద్ర కమిటీ ఏర్పడింది.
17వ మహాసభ : 2002 మార్చి 19-24 తేదీలలో ఆంధ్రప్రదేశ్‌లోని హైదరాబాద్‌లో జరిగింది. హరికిషన్‌సింగ్ సూర్జిత్ నాలుగోసారి ప్రధాన కార్యదర్శిగా ఎన్నికయ్యారు. ఇ బాలానందన్, జ్యోతిబసు, విఎస్ అచ్యుతానందన్, ఇకె నయనార్, సీతారాం ఏచూరీ, ఎస్.రామచంద్రన్‌పిళ్లై, ప్రకాశ్‌కరత్, పి.రామచంద్రన్, ఆర్.ఉమానాధ్, మాణిక్‌సర్కార్, బిమన్‌బసు, ఎంకె పాంథే, అనిల్‌బిశ్వాస్, పినరరు విజయన్, బుద్ధదేవ్ భట్టాచార్య, కొరటాల సత్యనారాయణలతో పొలిట్‌బ్యూరో ఏర్పడింది. 77 మందితో కేంద్ర కమిటీ ఏర్పడింది.
18వ మహాసభ : 2005 ఏప్రిల్ 6-11వ తేదీలలో న్యూఢిల్లీలో జరిగింది. ప్రధాన కార్యదర్శిగా కామ్రేడ్ ప్రకాశ్‌కరత్ ఎన్నికయ్యారు. జ్యోతిబసు, వీఎస్ అచ్యుతానందన్, సీతారాం ఏచూరీ, రామచంద్రన్ పిళ్లై, ఆర్.ఉమానాధ్, మాణిక్ సర్కార్, బిమన్‌బసు, అనిల్‌బిశ్వాస్, ఎంకె పాంథే, పినరరు విజయన్, బుద్ధదేవ్ భట్టాచార్య, కె. వరదరాజన్, బివి రాఘవులు, హరికిషన్‌సింగ్ సూర్జిత్, బృందాకరత్, చిత్తబ్రత మజుందార్‌లతో పొలిట్‌బ్యూరో ఏర్పడింది. 77 మందితో కేంద్ర కమిటీని ఎన్నుకున్నారు.
19వ మహాసభ : 2008 మార్చి 29 నుంచి ఏప్రిల్ 3 వరకు తమిళనాడులోని కోయంబత్తూర్‌లో జరిగింది. ప్రధాన కార్య దర్శిగా ప్రకాశ్‌కరత్ తిరిగి ఎన్నికయ్యారు. నిరుపమసేన్, విఎస్ అచ్యుతానందన్, సీతారాం ఏచూరీ, ఎస్. రామచం ద్రన్ పిళ్లై, మాణిక్‌సర్కార్, బిమన్‌బసు, ఎంకె పాంథే, పినరరు విజయన్, బుద్ధదేవ్ భట్టాచార్య, కె.వరదరాజన్, బివి రాఘవులు, బృందాకరత్, మహ్మద్ అమీన్, కె.బాల కృష్ణన్, జ్యోతిబసు(ప్రత్యేక ఆహ్వానితులు)తో పొలిట్‌బ్యూరో ఏర్పడింది. 87 మందితో కేంద్ర కమిటీని ఎన్నుకున్నారు.
20వ మహాసభ : 2012 ఏప్రిల్ 4-9 తేదీలలో కేరళలోని కోజికోడ్‌లో జరిగింది. ప్రకాశ్‌కరత్ ప్రధాన కార్యదర్శిగా తిరిగి ఎన్నికయ్యారు. నిరుపమ్‌సేన్, సీతారాం ఏచూరీ, రామచంద్రన్‌పిళ్లై, మాణిక్‌సర్కార్, బిమన్‌బసు, పినరరు విజయన్, బుద్ధదేవ్ భట్టాచార్య, కె.వరదరాజన్, బివి రాఘవులు, బృందాకరత్, మహ్మద్ అమీన్, కె.బాలకృష్ణన్, ఎంఏ బేబీ, ఏకె పద్మనాభన్ పొలిట్‌బ్యూరో సభ్యులుగా ఎన్నికయ్యారు. 89 మందితో కేంద్ర కమిటీ ఎన్నికైంది.
21వ మహాసభ : 2015 ఏప్రిల్ 14-19 తేదీలలో ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నంలో జరిగింది. ప్రధాన కార్యదర్శిగా సీతారాం ఏచూరీ ఎన్నికయ్యారు. ఎస్.రామచంద్రన్ పిళ్లై, ఎంఏ బేబీ, బీవీ రాఘవులు, మాణిక్ సర్కార్, పినరరు విజయన్, బృందాకరత్, ప్రకాశ్‌కరత్, మహ్మద్ సలీం, బిమన్ బసు, కె.బాలకృష్ణన్, సూర్యకాంత్ మిశ్రా, ఏకె పద్మనాభన్, హన్నన్‌మొల్లా, సుభాషిణీ అలీ, పి. రామకృష్ణన్‌లతో పొలిట్‌బ్యూరో ఎన్నికైంది. కేంద్ర కమిటీ 91 మందితో ఎన్నికైంది.
Tue 17 Apr 21:03:55.404041 2018