Wed 18 Apr 10:26:51.73489 2018
హైదరాబాద్ : సీపీఎం 22వ జాతీయ మహాసభలు కొద్దిసేపట్లో హైదరాబాద్‌లోని ఆర్టీసీ కల్యాణ మండపంలో ప్రారంభం అయ్యాయి. తెలంగాణ సాయుధపోరాట యోధురాలు మల్లు స్వరాజ్యం పార్టీ పతాకాన్ని ఆవిష్కరించారు. మహాసభల్లో పాల్గొనేందుకు కమ్యూనిస్టు యోధులంతా నగరానికి చేరుకున్నారు. నాలుగు రోజులు పాటు జరిగే మహాసభలు దేశం ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలను చర్చించి, భవిష్యత్ కార్యాచరణ రూపొందిస్తారు.