హైదరాబాద్ : హైదరాబాద్ లో జరుగుతున్న సిపిఐ(ఎం) మహాసభల్లో ఆ పార్టీ పోలిట్ బ్యూరో సభ్యుడు, మహాసభల ఆహ్వాన కమిటీ గౌరవ అధ్యక్షులు బివి రాఘవులు స్వాగతోపన్యసం చేశారు. ఈ సంధర్భంగా ఆయన మాట్లాడుతూ, తెలంగాణ సాయుధపోరాటం, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో జరిగిన విధ్యుత్ ఉద్యమ పోరాటం దానిపై చంద్రబాబు నాయుడు జరిపిన దమనకాండ వివరించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత ఆ రాష్ట్ర సిపిఐ(ఎం)కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఆధ్వర్యంలో 8మంది సభ్యులతో కలిసి 154 రోజులు 4,200 కిలోమీటర్లు మహాజన పాదయాత్ర ఇక్కడ ఉన్న దళితుతులను,బహుజనులను మేల్కొలిపి ఐక్యం చేయడానికి తోడ్పడిందని ఆయన పేర్కోన్నారు.
ఈ సంధర్భంగా కమ్మ్యూనిస్టు యోధుడు పుచ్చలపల్లి సుందరయ్య త్యాగాన్ని ఆయన గుర్తుచేశారు. ఆయన పేరిట ఏర్పాటు చేసిన సుందరయ్య విజ్నాన కేంద్ర ఎన్నో అభ్యుదయ కార్యక్రమాలకు నిలయంగా మారిందని ఆయన తెలిపారు.