హైదరాబాద్: హైదరాబాద్ లో జరుగుతున్న సిపిఐ(ఎం) పార్టీ 22వ జాతీయ మహాసభలలో ఆ పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు, త్రిపుర మాజీ ముఖ్యమంత్రి మాణిక్ సర్కార్ సంతాప తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ఈ సంధర్భంగా ఆ పార్టీ 21వ మహాసభ తరువాత మరణించిన ఆ పార్టీ కేంద్ర నాయకులు, రాష్ట్ర కమిటీ సభ్యులు మరియు ఇతర వామపక్ష పార్టీల నాయకులకు మహాసభ నివాళి అర్పించింది. కేరళలో ఆరెస్సెస్ చేతిలో హత్యకు గురైన పార్టీ కేడర్, మరియు పశ్చిమబెంగాల్ లో టిఎంసి పార్టీ దాడులలో హత్యకు గురైన కార్యకర్తలకు మహాసభ నివాళులర్పించింది.
21వ మహాసభ తరువాత మరణించిన ప్రజాసేవ రంగంలో ఉన్న ప్రముఖులను సర్కార్ ఈ సంధర్భంగా గుర్తుచేశారు. సంఘవ్యతిరేక శక్తుల చేతులలో హత్యకు గురైన వారికికూడా ఈ సంధర్భంగా మహాసభ నివాళులర్పించింది.
అమరులైన ప్రముఖులు:
మహ్మద్ అమీన్: పొలిట్ బ్యూరో సభ్యులు, సిపిఐ(ఎం)
కొగెన్ దాస్ : సిసి మెంబర్, సిపిఐ(ఎం)
సుకుమోల్ సేన్ : సిపిఐ(ఎం)
ఎబి బర్దన్ : సిపిఐ జాతీయ నాయకులు
అశోక్ ఘోష్: ఫార్వార్డ్ బ్లాక్ జాతీయ నాయకులు
ఫీడెల్ క్యాస్ట్రో: క్యూబా కమ్యూనిస్ట్ దిగ్గజం
కల్బుర్గి: రచయిత, సంఘవ్యతిరేక శక్తుల చేతిలో హత్యకు గురయ్యారు
గౌరీ లంకేశ్ : రచయిత, సంఘవ్యతిరేక శక్తుల చేతిలో హత్యకు గురయ్యారు
హస్నం కన్హయాలాల్ : థియటర్ ఆర్టిస్ట్, పద్మభూషణ్ గ్రహీత
స్టిఫెన్ హాకింగ్: ప్రముఖ శాస్త్రవేత్త.