Wed 18 Apr 13:02:56.132393 2018
హైదరాబాద్: హైదరాబాద్ లో జరుగుతున్న సిపిఐ(ఎం) 22వ మహాసభలలో ఆ పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు మాణిక్ సర్కార్అధ్యక్షోపన్యసం చేశారు. ఈ సంధర్భంగా ఆయన మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వ ప్రజావ్యతిరేక కార్యక్రమాలు అమలు చేస్తూ, ఆరెస్సెస్ అడుగుజాడలలో నడుస్తుందని, అమెరికా సామ్రాజ్యవాద ఎజెండాను అమలు చేస్తూ సామాన్యులపై భారాలను మోపుతుందని పేర్కోన్నారు. వామపక్షాలు మాత్రమే ఈ ప్రభుత్వ ఆగాడాలను ఆపగలవని పేర్కోన్నారు. పార్టీ రాజ్యాంగంలో పేర్కొన్న విధంగా ప్రతి మూడు సంవత్సరాకు ఒకసారి పార్టీ మహాసభ జరుపుకోని, రాజకీయ ఎత్తుగడలను రూపొందించుకుంటుందని పేర్కోన్నారు. ఈ మహాసభ పార్టీ రాజకీయ ముసాయిదాను చర్చించి, పార్టీ ఎత్తుగడల పంథాను అమలు చేసే తీర్మాన్నాన్ని ఆమోదించాలని ఆయన ప్రతినిధులను కోరారు.