Wed 18 Apr 13:10:26.641831 2018
హైదరాబాద్ : మతోన్మాదానికి వ్యతిరేకంగా పోరాడాలని సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యులు బివి.రాఘవులు పిలుపు ఇచ్చారు. మోదీ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలు అవలంభిస్తోందన్నారు. హైదరాబాద్ లో జరుగుతున్న ఆ పార్టీ 22వ జాతీయ మహాసభల్లో ఆయన మాట్లాడారు. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాల్సిన అవసరం చాలా ఉందన్నారు. మతోన్మాదానికి వ్యతిరేకంగా ప్రజాస్వామ్య పరిరక్షణకు కృషి చేసేవారందరికీ రెడ్ సెల్యూట్ తెలియజేస్తున్నట్లు తెలిపారు. మతోన్మాదానికి వ్యతిరేకంగా అన్ని వర్గాలూ పోరాడాల్సిన తరుణమిదన్నారు. తెలంగాణ సాయుధ పోరాటం నేటి తమకు స్ఫూర్తి అన్నారు. సామాజిక న్యాయం కోసం తెలంగాణ రాష్ట్ర శాఖ మహాజన పాదయాత్ర నిర్వహించిందన్నారు.