Wed 18 Apr 16:49:27.531249 2018
హైదరాబాద్ : దేశ ప్రజల ఆశలు, ఆకాంక్షలను నెరవేర్చడంతో ప్రధాని మోడీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని ఫార్వర్డ్ బ్లాక్ కార్యదర్శి జీఆర్ శివశంకర్ విమర్శించారు. ఏటా రెండు కోట్ల మందికి ఉద్యోగావకాశాలు కల్పిస్తానని గత ఎన్నికల్లో హామీ ఇచ్చిన మోడీ... అధికారంలోకి వచ్చిన తర్వాత నిరుద్యోగుల ఆశలు ఒమ్ము చేశారని మండిపడ్డారు. సీపీఎం 22వ జాతీయ మహాసభల ప్రారంభోత్సవానికి హాజరైన శివశంకర్... మోదీ విధానాలు దేశానికి నష్టదాయకంగా పరిణమించాయని విమర్శించారు.