Wed 18 Apr 17:11:47.786881 2018
హైదరాబాద్: హైదరాబాద్ ఆర్టీసీ కళాభవన్ లో జరుగుతున సిపిఐ(ఎం) మహాసభ లో భాగంగా కొద్ది సేపటి క్రితమే ప్రతినిధుల సభ ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో వచ్చే ఐదు రోజులపాటు జరగనున్న మహాసభకు సంబంధించి స్టీరింగ్ కమిటీ, మినిట్స్ కమిటీ, రిజల్యూషన్ కమిటీ, ప్రిసిడియం లను ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రతిపాదించి సభ్యుల అమోదంపోదారు. ఈ రోజు జరిగిన ప్రారంభసభలో ఆహ్వనసంఘం తరపున ఆహ్వాన సంఘం గౌరవాధ్యాక్షులు బివి రాఘవులు తో పాటు వివిధ వామపక్ష పార్టీలకు చెందిన ఆహ్వానితులు మాట్లాడారు.