హైదరాబాద్:హైదరాబాద్ లో జరుగుతున్న సిపిఐ(ఎం) 22వ మహాసభల సంధర్భంగా ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరీ బిజెపి పాలనలో ఆర్‌ఎస్‌ఎస్ నియంతృత్వ దాడులు పెచ్చురిల్లాయని అభిప్రాయపడ్డారు. ఆ పార్టీ ఆధ్వర్యంలో నడిచే వారపతత్రిక పీపుల్స్ డెమొక్రసీ కీ రాసిన వ్యాసంలో ఆయన ఈ విషయాన్ని పేర్కోన్నారు. సిపిఐ(ఎం) బలోపేతం కోసం ఆయన పేర్కోన్న అంశం అనువాదం మీకోసం...
(అనువాదకులు : నెల్లూరు నరసింహారావు, సెల్:8886396999)
మరోవైపు రాజ్యాంగ సంస్థలకు వ్యతిరేకంగా గట్టి సవాలును విసరటం జరుగుతున్నది. ఈ మధ్యకాలంలో సుప్రీం కోర్టులో జరుగుతున్న పరిణామాలు న్యాయనిర్వహణ ప్రక్రియలో ప్రభుత్వ జోక్యాన్ని తెలియజేస్తున్నాయి. ఎన్నికల సంఘ నిస్పాక్షిత గురించి అనేక సందేహాలు తలెత్తాయి. ఫిల్మ్ సెన్సార్ బోర్డు నిర్ణయాలను ఆర్‌ఎస్‌ఎస్ గుండాలు ఖాతరు చేయటం లేదు. ఇందుకు ఉదాహరణగా పద్మావత్ సినిమాపై లేవనెత్తిన అనవసర వివాదాన్ని పేర్కొనవచ్చు. ఇది మన ప్రజల ప్రజాస్వామిక హక్కులపైనా, పౌరహక్కులపైనా ప్రత్యక్ష దాడి. ఒక బలమైన ప్రజా ఉద్యమంతో దీనిని ప్రతిఘటించవలసి ఉంటుంది.
అంతిమంగా అమెరికా వత్తిళ్ళకు తలొగ్గి ఈ బీజేపీ ప్రభుత్వం దేశ సార్వభౌమాధికారాన్ని బలహీనపరచి, ప్రపంచ విషయాలలో అమెరికా సామ్రాజ్యవాదానికి కావాలనే జూనియర్ భాగస్వామిగా మారటం మరో ముఖ్యమైన సవాలుగా ఆవిర్భవిస్తున్నది. తత్ఫలితంగా భారత విదేశాంగ విధానంలో పెనుమార్పులు సంభవించాయి. ప్రపంచ సమస్యలను పట్టించుకునేందుకు అమెరికా-ఇజ్రాయిల్- ఇండియా బంధం ఆవిర్భవిస్తున్నది.
(పూర్తి వ్యాసం: సిపిఐ(ఎం) ముందున్న సవాళ్లు : సీతారాం ఏచూరీ)