హైదరాబాద్: హైదరాబాద్ లో జరుగుతున్న సిపిఐ(ఎం) 22వ మహాసభలో ఆ పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు, మాజీ కార్యదర్శి ప్రకాశ్ కరాత్ ఇప్పటికే కేంద్రకమిటీ ఆమోదించిన రాజకీయ ముసాయిదాను ప్రతినిధుల సభలో ప్రవేశపెట్టారు. కాగా ప్రత్యమ్నయా రాజకీయ ముసాయిదాను ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరీ ప్రవేశపెట్టారు. కాగా రాజకీయ ఎత్తుగడల విషయంలో రాజకీయ పొత్తులకు సంబంధించి కేంద్రకమిటీలో భిన్నాభిప్రాయాలు ఉన్న విషయం తెలిసిందే. ఈ రెండు ముసాయిదాలపైన ప్రతినిధుల సభలో రేపటి నుండి చర్చలు జరుగుతాయి. వీటిలో ప్రతినిధుల సభ ఎంచుకున్న రాజకీయ ఎత్తుగడల పంథా పార్టీ వచ్చే మూడు సంవత్సరాలు అమలు చేయవలసి ఉంటుంది. సిపిఐ(ఎం) పార్టీలో ఉన్న అంతర్గత ప్రజాస్వామ్యం కారణంగా ఈ రెండు ముసాయిదాలు చర్చకు పెట్టారు. ప్రతినిధుల సభలో మెజారిటీ నిర్ణయాన్ని పార్టీ నిర్ణయంగా తీసుకుంటారు.
ప్రెస్ రిలీజ్ : సిపిఐ(ఎం) మహాసభలు లింక్